Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 12 Jun 2024 21:01 IST

1. మంత్రుల అభీష్టాలు, సమర్థత మేరకు రేపటిలోగా శాఖలు కేటాయింపు: చంద్రబాబు

జగన్‌ నాశనం చేసిన వ్యవస్థలను బాగు చేయాలని, రాష్ట్ర పునర్నిర్మాణంలో మంత్రులదే కీలక బాధ్యత అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులతో చంద్రబాబు సమావేశమయ్యారు. మంత్రుల అభీష్టాలు, వారి సమర్థత మేరకు రేపటిలోగా శాఖలు కేటాయిస్తానని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు.. మెగా డీఎస్సీపై తొలి సంతకం

ఏపీ సీఎంగా ప్రమాణం చేసిన చంద్రబాబు గురువారం సాయంత్రం 4.41 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. మెగా డీఎస్సీపై తొలి సంతకం, ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం రద్దుపై రెండో సంతకం, పింఛను రూ.4వేలకు పెంచుతూ మూడో సంతకం, స్కిల్‌ సైన్సెస్‌పై నాలుగో సంతకం, అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై ఐదో సంతకం చేయనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. తెలంగాణ గ్రూప్‌ -1 మెయిన్స్‌ పరీక్ష షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలో 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ఇటీవల ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన టీజీపీఎస్సీ తాజాగా మెయిన్స్‌ పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసింది. అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు గ్రూప్‌- 1 మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇంగ్లీష్‌, తెలుగు, ఉర్దూ భాషల్లో డిస్క్రిప్టివ్‌ విధానంలో ఈ పరీక్ష ఉంటుందని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. పోక్సో కేసులో.. యడియూరప్పకు నోటీసులు

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్‌.యడియూరప్పకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఆయనపై నమోదైన పోక్సో కేసు విచారణలో భాగంగా వాటిని ఇచ్చిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం దిల్లీలో ఉన్న ఆయన.. అక్కడినుంచి వచ్చిన తర్వాత విచారణకు హాజరవుతారని భాజపా నేత సన్నిహిత వర్గాలు మీడియాకు వెల్లడించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వారణాసిలో మోదీ ఓటమి నుంచి తప్పించుకున్నారు: రాహుల్‌ గాంధీ

ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేసిన వారణాసిలో ఆయన ఓటమి నుంచి తప్పించుకున్నారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. కేరళలోని మలప్పురంలో ఓ సమావేశంలో రాహుల్‌ గాంధీ పాల్గొని ప్రసంగించారు. అయోధ్య ప్రజల చేతిలో భాజపా ఓడినట్లే వారణాసిలో మోదీ ఓడిపోయి ఉండేవారని వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఎర్రకోటపై దాడి కేసులో ఉగ్రవాదికి క్షమాభిక్ష తిరస్కరణ

దాదాపు 24 ఏళ్ల క్రితం ఎర్రకోటపై జరిగిన దాడి కేసు(Red Fort Attack Case)లో దోషిగా తేలిన పాకిస్థాన్ ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్అ లియాస్ అష్ఫాక్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించినట్లు అధికారులు బుధవారం తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఎన్నికల విధుల్లో వాయుసేన దూకుడు.. 1000 గంటలకుపైగా హెలికాప్టర్ల సేవలు

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం విజయవంతంగా పూర్తిచేసింది. ఎన్నికలు సజావుగా సాగడంలో భారత వాయుసేన కూడా కీలక పాత్ర పోషించింది. తమ హెలికాప్టర్లతో మొత్తంగా వెయ్యి గంటలకుపైగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో తమ సేవలందించామని వాయుసేన వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఆ పాలసీలపై రుణ సదుపాయం కల్పించాల్సిందే: ఐఆర్‌డీఏఐ

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ప్రొడక్టులకు సంబంధించి బీమా నియంత్రణ సంస్థ ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (IRDAI) కీలక ఆదేశాలు జారీ చేసింది. పాలసీదారులకు నగదు అవసరాలు తీర్చుకునేందుకు సేవింగ్స్‌కు సంబంధిత బీమా ఉత్పత్తులపై ఆయా బీమా సంస్థలు విధిగా రుణసదుపాయం కల్పించాలని సూచించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఉద్యోగినులతో ‘మస్క్‌’ లైంగిక సంబంధం..! అమెరికా నాట సంచలన కథనం

టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk)పై మరోసారి సంచలన కథనం ప్రచురితమైంది. తన సంస్థ స్పేస్‌ఎక్స్‌ (SpaceX)లో పని చేసే పలువురు మహిళా ఉద్యోగినులతో ఆయన లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు తాజా నివేదిక పేర్కొంది. ఇంటర్న్‌ కోసం వచ్చిన ఓ యువతి కూడా అందులో ఉన్నట్లు తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. శ్రీలంకకు షాక్‌ ఇచ్చిన వరుణుడు.. సూపర్‌-8కు చేరిన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా

టీ20 ప్రపంచకప్‌ 2024లో శ్రీలంక లీగ్‌ దశలోనే ఇంటిముఖం పట్టనుంది! నేడు నేపాల్‌తో జరగాల్సిన మ్యాచ్‌లో నెగ్గి సూపర్‌-8 రేసులో నిలవాలనుకున్న శ్రీలంక ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించడంతో గ్రూప్‌ డిలో మూడు విజయాలు సాధించి 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా సూపర్‌-8కు అర్హత సాధించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని