Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 14 Jun 2024 20:59 IST

1. వారి సేవలు మరో రూపంలో వినియోగించుకుంటాం: చంద్రబాబు

తెలుగుదేశం సీనియర్‌ నేతలు, పలువురు మంత్రులు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిశారు. మంత్రి వర్గం కూర్పు చేసిన విధానాన్ని చంద్రబాబు వారికి వివరించారు. మంత్రివర్గంలో చోటు దక్కని వారి సేవలను మరో రూపంలో వినియోగించుకుంటామని సీఎం స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఐటీ, ఎలక్ట్రానిక్‌ కంపెనీలను ఆకర్షిస్తాం: మంత్రి నారా లోకేశ్‌

వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల హామీ నెరవేర్చేందుకు కృషి చేస్తామని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. మంత్రులకు శాఖల కేటాయింపు తర్వాత తొలిసారి ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగాల కల్పనకు ఇతర రాష్ట్రాలతో తీవ్రంగా పోటీ పడతామన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్‌ కంపెనీలను ఆకర్షిస్తామని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ‘ధరణి’ పోర్టల్‌ ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టాం: మంత్రి పొంగులేటి

గత భారాస ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్‌ వల్ల రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు భూసమస్యలను ఎదుర్కొంటున్నారని, ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయని తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఈ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికే ధరణి పోర్టల్‌ను పునర్‌వ్యవస్థీకరించి, భూ వ్యవహరాలకు సంబంధించిన చట్టాల్లో  మార్పులు తేవాల్సిన అవసరమేర్పడిందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. పోలీసులపై కక్ష సాధింపు చర్యలు ఉండవు: హోం మంత్రి అనిత

రాష్ట్రంలో గంజాయి స్మగ్లర్లు, సరఫరాదారులపై ఉక్కుపాదం మోపుతామని ఏపీ హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ.. తెలుగుదేశం ప్రభుత్వంలో ఆడబిడ్డల భద్రతకు అధిక ప్రాధాన్యం ఉంటుందన్నారు. పోలీసు అధికారులపై కక్ష సాధింపు చర్యలు ఉండవని, తప్పు చేసిన వారిని గాడిలో పెట్టడం తమ బాధ్యతగా భావిస్తున్నామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కొవిడ్‌ అడ్వాన్స్‌ నిలిపివేత.. ఈపీఎఫ్‌ఓ నిర్ణయం

కొవిడ్‌ సమయంలో తీసుకొచ్చిన కొవిడ్‌ అడ్వాన్స్‌ సదుపాయాన్ని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ నిలిపివేసింది. కొవిడ్‌ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ అడ్వాన్స్‌ సదుపాయాన్ని నిలిపివేస్తున్నట్లు ఈపీఎఫ్‌ఓ అధికారికంగా ప్రకటించింది. ఈమేరకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఫోన్‌ నంబర్లకు ఛార్జీలు.. ట్రాయ్‌ స్పష్టత

ప్రస్తుత, కొత్త మొబైల్‌ ఫోన్‌ - ల్యాండ్‌ లైన్‌ నంబర్లకూ ఛార్జీ వసూలుచేయాలని టెలికాం నియంత్రణాధికార సంస్థ ట్రాయ్‌ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీటిని ట్రాయ్‌ ఖండించింది. ఫోన్‌ నంబర్లకు కస్టమర్ల నుంచి ఫీజులు విధించే ప్రణాళికేదీ లేదని స్పష్టంచేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘జమిలి’పై కోవింద్‌ కమిటీ నివేదిక.. త్వరలో క్యాబినెట్‌ ముందుకు!

‘ఒకే దేశం.. ఒకే ఎన్నికలు’ సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ ఇచ్చిన నివేదిక త్వరలోనే కేంద్ర క్యాబినెట్‌ ముందుకురానుంది. ఇందుకోసం కేంద్ర న్యాయశాఖ సంసిద్ధమవుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 100 రోజుల అజెండాలో భాగంగా దీన్ని సాధ్యమైనంత తొందరగా క్యాబినెట్‌ ముందు ఉంచనున్నట్లు తెలిపాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. గ్రూపులో గర్జించిన కూనలు.. గణాంకాల్లో చిరు జట్లదే హవా..!

టీ20 ప్రపంచకప్‌లో చిన్న జట్లు సత్తా చాటుతుంటే.. ప్రతి గ్రూపులో ఒక బడా జట్టు సూపర్‌-8కు చేరకుండానే ఇంటికిపోయే పరిస్థితి నెలకొంది. గణాంకాల్లో కూడా నూతన జట్ల ఆటగాళ్లే పూర్తి ఆధిపత్యం చూపిస్తున్నారంటే.. ఈ టోర్నీ ఎంత ఉత్కంఠగా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

9. జీ7 సదస్సు వేళ.. మోదీ-జెలెన్‌స్కీ భేటీ

ఇటలీ వేదికగా జరుగుతోన్న జీ7 దేశాల సదస్సులో భారత్ ఆహ్వానిత దేశంగా పాల్గొంది. అక్కడి వెళ్లిన ప్రధాని మోదీ వరుస ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటున్నారు. బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మేక్రాన్‌తో సంభాషించారు. అలాగే ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, మోదీ మధ్య కూడా భేటీ జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అలాగైతే కాల్పుల విరమణ చేస్తాం: ఉక్రెయిన్‌కు రష్యా ఆఫర్

రష్యా అధ్యక్షుడు పుతిన్ కాల్పుల విరమణకు ఆదేశిస్తానంటూ ఉక్రెయిన్‌కు ఆఫర్ ఇచ్చారు. అయితే అందుకు రెండు షరతులు పెట్టారు. తమ స్వాధీనంలో ఉన్న నాలుగు ప్రాంతాల్లో బలగాలను ఉపసంహరించుకోవాలని, నాటోలో చేరాలన్న ఆలోచనను విరమించుకోవాలని కీవ్‌కు షరతు విధించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని