Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 16 Jun 2024 20:59 IST

1. ఐపీఎస్‌ అధికారి గరికపాటి బిందు మాధవ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేత

ఐపీఎస్‌ అధికారి గరికపాటి బిందు మాధవ్‌పై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే సర్వీసులోకి తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది. ఎన్నికల సమయంలో పల్నాడు జిల్లాలో అల్లర్లు జరిగాయి. హింసాత్మక ఘటనలు జరిగిన నేపథ్యంలో అప్పటి పల్నాడు జిల్లా ఎస్పీగా ఉన్న బిందు మాధవ్‌ను  సస్పెండ్‌ చేస్తూ గతంలో ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. సైబర్‌ నేరగాళ్లు కాజేసిన రూ.31 కోట్లు.. బాధితులకు అందజేసిన అధికారులు

సైబర్‌ నేరాల్లో బాధితుల నుంచి నేరగాళ్లు కాజేసిన సొమ్మును తిరిగి తీసుకొచ్చేందుకు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా గత మూడు నెలల వ్యవధిలో తెలంగాణ లీగల్ సర్వీసెస్‌ అథారిటీతో కలిసి.. బాధితులు పొగొట్టుకున్న సొమ్ము రూ.31.29 కోట్లు తిరిగి వారికి ఇచ్చినట్టు బ్యూరో డైరెక్టర్‌ శిఖా గోయల్‌ తెలిపారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మార్పొస్తుందని ఆశిస్తున్నా: పవన్‌ కల్యాణ్‌పై ఉపేంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు

చిత్ర పరిశ్రమ నుంచి రాజకీయ రంగంలో అడుగు పెట్టి అక్కడా విజయం అందుకున్న పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)ను చూస్తే గర్వంగా ఉందన్నారు కన్నడ నటుడు ఉపేంద్ర. ఆయన సిద్ధాంతాలతో ఆంధ్రప్రదేశ్‌లో మార్పొస్తుందని ఆశిస్తున్నానన్నారు. అంతా మంచే జరగాలని ఆకాంక్షించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కౌంటింగ్‌ వేళ ఈవీఎం అన్‌లాక్‌ ఘటన..ఎంపీ బంధువు అరెస్ట్‌

ముంబయి వాయువ్య లోక్‌సభ స్థానానికి కొత్తగా ఎన్నికైన ఎంపీ రవీంద్ర వైకర్  బావమరిది మంగేష్ పాండిల్కర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. జూన్ 4న కౌంటింగ్ జరుగుతున్న సెంటర్‌లో మొబైల్ ఫోన్‌ను ఉపయోగించారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పేటీఎం - జొమాటో రూ.1,500 కోట్ల డీల్‌?

ఆర్‌బీఐ ఆంక్షలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఫిన్‌టెక్‌ కంపెనీ పేటీఎం.. వాటి నుంచి గట్టెక్కేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఈ మేరకు ఆహార పంపిణీ సంస్థ జొమాటోతో చర్చలు జరుపుతోంది. సినిమాలు, కార్యక్రమాల టికెట్‌ బుకింగ్‌ వ్యాపారాన్ని విక్రయించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ ఒప్పందం విలువ రూ.1,500 కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అల్లర్ల గురించి పిల్లలకు బోధించడం ఎందుకు?: ఎన్‌సీఈఆర్‌టీ చీఫ్‌

తొమ్మిది నుంచి 12వ తరగతులకు సంబంధించిన సిలబస్‌లో కొన్ని పాఠ్యాంశాలను తొలగించడంపై ఎన్సీఈఆర్‌టీ డైరెక్టర్‌ దినేశ్‌ ప్రసాద్‌ సక్లానీ స్పందించారు. ‘‘పాఠ్య పుస్తకాల ద్వారా చిన్నారులకు అల్లర్ల గురించి ఎందుకు బోధించాలి? సమాజంలో నేరాలు, హింస ఎలా సృష్టించాలి? బాధితులుగా ఎలా మారాలి? అనే విషయాలను మన విద్యార్థులకు బోధించాలా?’’అని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అతడికి సెలవులు పొడిగించండి.. జీతం పెంచండి: ఒరాకిల్‌ సంస్థకు విజ్ఞప్తులు

టీ20 ప్రపంచకప్‌లో అమెరికాను ‘సూపర్‌ 8’కు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన సౌరభ్‌ నేత్రావల్కర్‌ గురించే ఇప్పుడు అంతటా చర్చ. పలువురు టెకీలు అతడి అద్భుత ప్రదర్శనను మెచ్చుకుంటూ.. ఒరాకిల్‌ సంస్థకు విజ్ఞప్తులు పంపారు. అతడితో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేయించకూడదని, సెలవులు పొడిగించాలని ఒకరు కోరితే.. మరొకరు అతడి జీతాన్ని 60 శాతం పెంచాలని అడిగారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. స్మృతి మంధాన సెంచరీ.. దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించిన భారత్

భారత అమ్మాయిలు అదరగొట్టారు.  చిన్నస్వామి స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమ్‌ఇండియా 143 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. శ్రీలంక-భారత్‌ ప్రతిపాదిత రోడ్డు మార్గం.. ద్వీపదేశం ఏమందంటే!

భారత్‌-శ్రీలంక మధ్య భూ అనుసంధానం ప్రతిపాదనపై ద్వీపదేశం కీలక ప్రకటన చేసింది. మన్నార్‌ జిల్లాలో జరుగుతోన్న అభివృద్ధి పనులను పర్యవేక్షించిన ఆ దేశ అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే.. ప్రతిపాదిత భూ మార్గం అధ్యయనంపై ప్రాథమిక అంశాలు ముగిశాయని, త్వరలోనే తుది దశ నివేదిక పూర్తవుతుందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. రష్యాలో కలకలం.. జైలు సిబ్బందినే బందీలుగా పట్టుకుని..!

రష్యాలోని ఓ నిర్బంధ కేంద్రంలో కొంతమంది విచారణ ఖైదీలు కలిసి ఇద్దరు సిబ్బందిని బందీలుగా పట్టుకోవడం కలకలం రేపింది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన భద్రతా బలగాలు.. నిందితుల్లో పలువురిని అంతమొందించినట్లు సమాచారం. అధికారుల వివరాల ప్రకారం.. రోస్తోవ్-ఆన్-డాన్ నగరంలోని ప్రీ-ట్రయల్ డిటెన్షన్ సెంటర్‌లో ఆరుగురు ఖైదీలు కలిసి ఇద్దరు జైలు గార్డులను బందీలుగా పట్టుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని