Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 23 Jun 2024 21:03 IST

1. సీఎం రేవంత్‌రెడ్డి దిల్లీ టూర్‌.. మంత్రివర్గ విస్తరణపై పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం

పార్లమెంట్‌ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిల్లీ వెళ్లనున్నారు. సోమవారం, మంగళవారం దిల్లీలో ఉండనున్న సీఎం.. పార్టీ పెద్దలతో సమావేశం కానున్నారు. మంత్రిమండలి విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక తదితర అంశాలపై చర్చించే అవకాశముంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఏపీ డిప్యూటీ సీఎంను కలవనున్న తెలుగు సినీ నిర్మాతలు

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌తో తెలుగు సినీ నిర్మాతలు సమావేశం కానున్నారు. సోమవారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఇందుకు సంబంధించిన సమావేశం జరగనుంది. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు,  తెలుగు చిత్ర పరిశ్రమ సమస్యలను పవన్‌కు వివరించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మాయావతి రాజకీయ వారసుడిగా ఆకాశ్‌ ఆనంద్‌

బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి మాయావతి తన రాజకీయ వారసుడిని మరోసారి ప్రకటించారు. పార్టీ బాధ్యతలను తన మేనల్లుడైన ఆకాశ్ ఆనంద్‌కు తిరిగి అప్పగించారు. గతేడాది డిసెంబర్‌లోనే తన రాజకీయ వారసుడిగా ఆకాశ్‌ ఆనంద్‌ని ప్రకటించిన మాయావతి.. మే నెలలో సార్వత్రిక ఎన్నికల వేళ కేసు నమోదు కావడంతో ఆయన్ను ఆ బాధ్యతల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఎన్‌టీఏ కొత్త చీఫ్‌ ప్రదీప్‌ సింగ్‌ ఖరోలా గురించి తెలుసా?

శనివారమే జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) సంస్కరణల కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఆ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ సుబోధ్‌ సింగ్‌కు ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ఎన్‌టీఏ కొత్త డీజీగా ఐఏఎస్‌ అధికారి ప్రదీప్‌ సింగ్‌ ఖరోలాను నియమించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఐఆర్‌సీటీసీ.. వ్యక్తిగత ఐడీతో ఇతరులకు టికెట్‌ బుక్‌ చేస్తే చిక్కులే!

ఐఆర్‌సీటీసీ ద్వారా ఆన్‌లైన్‌లో రైలు టికెట్‌ బుక్‌ చేసుకోవడంతోపాటు ఒక్కోసారి బంధువులు, స్నేహితులకూ సాయం చేస్తుంటారు. ఈ తరహా విధానాన్ని రైల్వేశాఖ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వ్యక్తిగత ఐడీతో ఇతరులకు టికెట్‌ బుక్‌ చేస్తే జైలుశిక్షతోపాటు భారీ జరిమానా పడుతుంది. ఇందుకు సంబంధించి బుకింగ్‌ నిబంధనల్లో స్పష్టంగా పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కృత్రిమ మేధతో మరిన్ని ఉద్యోగాలు.. డెలాయిట్‌ ఏఐ ఎగ్జిక్యూటివ్‌ అంచనా

కృత్రిమ మేధ తక్కువ నైపుణ్యాలున్న మనుషులను నాణ్యమైన స్కిల్స్‌ ఉన్నవారితో రీప్లేస్‌ చేస్తుందని డెలాయిట్‌ ఏఐ ఎగ్జిక్యూటివ్‌ రోహిత్‌ టాండన్‌ తెలిపారు. ఈ అధునాతన సాంకేతికత వల్ల ఉద్యోగాలు పోతాయని వినిపిస్తున్న వాదనలను ఆయన కొట్టిపారేశారు. భవిష్యత్తు ఏఐ - మానవుల భాగస్వామ్యానిదేనని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. స్మృతి మంధాన హ్యాట్రిక్‌ సెంచరీ మిస్‌.. దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ క్లీన్‌స్వీప్

భారత మహిళల క్రికెట్‌ జట్టు అదరగొట్టింది. దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ని 3-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఆదివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన చివరి (మూడో) వన్డేలో టీమ్‌ఇండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.  మహిళల క్రికెట్‌లో మూడు వన్డేల సిరీస్‌లో అత్యధిక పరుగులు (343) చేసిన క్రికెటర్‌గా స్మృతి మంధాన రికార్డు సృష్టించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ‘డియర్‌ బ్రదర్స్‌ అండ్‌ సిస్టర్స్‌ ఆఫ్‌ వయనాడ్‌’.. రాహుల్‌ భావోద్వేగ లేఖ

వయనాడ్‌  ప్రజలను ఉద్దేశిస్తూ భావోద్వేగ కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ లేఖ రాశారు. తన నిర్ణయాన్ని మీడియాకు చెప్పేందుకు చాలా బాధపడినట్టు వెల్లడించారు. తాను విపత్కర పరిస్థితుల్లో ఉన్న సమయంలో.. వయనాడ్‌ ప్రజల ప్రేమాభిమానాలే కాపాడాయని అన్నారు. తనకు ఆశ్రయం కల్పించి, ఓ కుటుంబ సభ్యుడిలా చూసుకున్నారన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. దేశ పార్లమెంట్లో పాక్‌ జట్టు పరువు పాయే..!

టీ20 ప్రపంచకప్‌లో తమ జట్టు ఘోరవైఫల్యంపై పాక్‌లో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. తాజాగా ఆ దేశ పార్లమెంట్‌లో కూడా విమర్శించారు. ఓటమి బాధ్యత నుంచి తప్పించుకోవడానికి కారణాలు వెతుక్కోవాలని ఎద్దేవా చేశారు. అవసరమైతే ఇతరులపైకి నెట్టేయాలని ఆ దేశ పార్లమెంటేరియన్‌ ఒకరు సభలోనే సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. రష్యా బాంబుల వర్షం.. సాయం కోరిన జెలెన్‌స్కీ

రష్యా వరుసగా దాడులకు పాల్పడుతోన్న నేపథ్యంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిన్‌ జెలెన్‌స్కీ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. భాగస్వామ్య దేశాలన్నీ ఉక్రెయిన్‌ వైమానిక రక్షణను బలోపేతం చేసుకునేందుకు సహకరించాలని కోరారు. అత్యాధునిక ఆయుధాలను సమకూర్చాలని విజ్ఞప్తిచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని