Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 28 Jun 2024 21:05 IST

1. ఒక సీఎంకు 986 మందితో భద్రతా?: చంద్రబాబు ఆశ్చర్యం

రాజకీయ నేరస్థులకు రాష్ట్రంలో ఎక్కువ భద్రత ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఒక ముఖ్యమంత్రికి 986 మందితో భద్రతా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పోలవరంపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా గత సీఎం జగన్‌ భద్రత అంశంపై విలేకర్లు అడిగిన ప్రశ్నపై చంద్రబాబు స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రుణమాఫీకి నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు: సీఎం రేవంత్‌

రుణమాఫీకి నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందుకు రేషన్‌ కార్డు ప్రామాణికం కాదని స్పష్టం చేశారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ తర్వాత రైతుబంధు ఇతర పథకాలపై దృష్టి పెడతామని, కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన రెండు రోజుల తర్వాత తెలంగాణ బడ్జెట్ సమావేశాలుంటాయని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. షాద్‌నగర్‌లోని పరిశ్రమలో భారీ పేలుడు.. ఆరుగురు దుర్మరణం

రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. స్థానిక సౌత్‌ గ్లాసు పరిశ్రమలో కంప్రెషర్‌ పేలడంతో ఆరుగురు మృతి చెందారు. ఈ పేలుడుతో పరిశ్రమ వద్ద భీతావహ వాతావరణం నెలకొంది. గాజు పరిశ్రమ కావడంతో కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. ఈ ఘటనలో 15మందికి గాయాలు కాగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. రైతులు, ఉద్యోగుల కోసం అవసరమైతే అదానీ కాళ్లు పట్టుకుంటా: సోమిరెడ్డి

కృష్ణపట్నం నుంచి కంటైనర్‌ పోర్టును తరలిపోనివ్వబోమని తెదేపా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు. కంటైనర్‌ పోర్టు తరలింపుతో పది వేల మంది ఉపాధి కోల్పోతారన్నారు. ఎన్డీయే కూటమి ఎంపీలతో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని.. రైతులు, ఉద్యోగుల కోసం అవసరమైతే ఆదానీ కాళ్లు పట్టుకుంటానని వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పార్టీని వీడే వారి గురించి ఆలోచించొద్దు: కేసీఆర్‌

పార్టీని వీడి దొంగల్లో కలిసిన వారి గురించి బాధలేదని.. అంతకన్నా మెరుగైన, మెరకల్లాంటి యువ నాయకులను పార్టీ సృష్టిస్తుందని భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అన్నారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల నుంచి వచ్చిన నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. నీట్‌పై చర్చకు ఇండియా కూటమి సిద్ధం: రాహుల్‌

లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ గాంధీ విద్యార్థులనుద్దేశించి వీడియో సందేశం విడుదల చేశారు. నీట్‌(NEET) పరీక్షలో జరిగిన అవినీతిపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంతో చర్చలు జరపడమే ఇండియా కూటమి లక్ష్యమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంతో శాంతియుతంగా చర్చించడానికి విపక్ష నేతలు సిద్ధంగా ఉన్నారన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు యథాతథం.. ఆర్థిక శాఖ ప్రకటన

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) రెండో త్రైమాసికానికి గానూ చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల వ‌డ్డీ రేట్లను య‌థాత‌థంగా కొన‌సాగిస్తున్నట్లు ఆర్థికశాఖ శుక్రవారం ప్రకటించింది. పాత వడ్డీ రేట్లే జూన్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు ఉంటాయని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఫైనల్‌కు వర్షం ముప్పు.. రిజర్వ్‌డే నాడూ మ్యాచ్‌ జరగకపోతే.. నిబంధనలు ఎలా ఉన్నాయ్‌..?

టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. దక్షిణాఫ్రికాతో ఫైనల్‌ పోరుకు సిద్ధమైంది. కరీబియన్‌లో ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఫైనల్‌ రోజు వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ నివేదికలు చెబుతున్నాయి. 70 శాతం వర్షం పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ పరిస్థితిపై కథనం కోసం క్లిక్‌ చేయండి 

9. పీజీ చేసిన ఉద్యోగికి.. లీవ్‌లెటర్‌ రాయడం రాకుంటే ఎలా? - సుప్రీం కోర్టు

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బోధన సామర్థ్య పరీక్ష నుంచి మినహాయింపు కోరుతూ బిహార్‌లో స్థానిక సంస్థలు నియమించుకున్న ఉపాధ్యాయులు చేసిన అభ్యర్థనను భారత సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఉద్యోగం పొందిన ఓ పోస్టుగ్రాడ్యుయేట్‌కు కనీసం లీవ్‌ లెటర్‌ కూడా రాయరాని పరిస్థితి ఉందని, అటువంటి వారు నైపుణ్యాలను మెరగుపరచుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. నేనిప్పుడు ఏ పార్టీ మనిషిని కాదు.. వీడియో విడుదల చేసిన అలీ

హాస్య నటుడు అలీ (Ali) రాజకీయాలకు స్వస్తి పలికారు.ఈ మేరకు ఆయన వీడియో విడుదల చేశారు. ‘పది మందికి సాయపడటం కోసమే రాజకీయాల్లోకి వచ్చా. ఎప్పుడూ ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదు. ప్రస్తుతం నేను ఏ పార్టీ మనిషిని కాదు’ అని అలీ పేర్కొన్నారు. వీడియో కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని