Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 07 Jul 2024 21:04 IST

1. జింబాబ్వే చిత్తు.. రెండో టీ20లో భారత్ ఘన విజయం

జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో ఓటమిపాలైన టీమ్ఇండియా.. రెండో టీ20లో అదరగొట్టింది. హరారె వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్యఛేదనలో జింబాబ్వే 18.4 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. వైభవంగా పూరీ జగన్నాథుని రథయాత్ర.. హాజరైన రాష్ట్రపతి

ఒడిశాలోని పూరీ జగన్నాథుని విశ్వప్రసిద్ధ రథయాత్ర భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ఆదివారం సాయంత్రం వైభవంగా ప్రారంభమైంది. ఈసారి రథయాత్రకు ప్రత్యేకత ఉంది. 1971 తర్వాత ఒకేరోజు జగన్నాథుని నవయవ్వన దర్శనం, నేత్రోత్సవం, రథయాత్ర నిర్వహిస్తున్నారు. తొలిసారి రాష్ట్రపతి ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఎన్టీఆర్‌ జిల్లాలో బాయిలర్‌ పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా

ఎన్టీఆర్ జిల్లాలోని అల్ట్రాటెక్‌  సిమెంట్‌ పరిశ్రమలో బాయిలర్ పేలిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు అండగా నిలవాలని ఆదేశించారు. ఎన్టీఆర్‌ జిల్లా బోదవాడలోని అల్ట్రాటెక్‌ సిమెంట్‌ కర్మాగారంలో బాయిలర్‌ పేలి 16మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో అర్జున్‌, వెంకటేశ్‌ మృతి చెందారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అలాచేసిన వారు విజయ తీరాలకు చేరతారు: సీఎం రేవంత్‌

 తెలంగాణలో గ్రూప్‌ -1 ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు సీఎం రేవంత్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. జీవితంలో లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, దాని కోసం ప్రయత్నించడం.. విజయం సాధించే వరకు ప్రయత్నాన్ని విరమించకపోవడం ఒక వ్యాపకంగా పెట్టుకున్నవారు ఎప్పటికైనా విజయతీరాలకు చేరతారని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మణికొండ డ్రగ్స్‌ కేసు.. పట్టుబడిన వారిలో ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు

మణికొండలోని కేవ్‌ పబ్‌లో టీజీ న్యాబ్‌ అధికారులు, రాయదుర్గం ఎస్‌వోటీ పోలీసులు సోదాలు నిర్వహించి 55 మందిని అదుపులోకి తీసుకున్నారు. డీజే నిర్వాహకుడు ఆయూబ్‌తో పాటు మరో 24 మంది డ్రగ్స్‌, గంజాయి తీసుకున్నట్టు తేలిందని పోలీసులు తెలిపారు. మత్తు పదార్థాలు తీసుకున్నవారిలో ఎక్కువ మంది విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు ఉన్నారని వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ‘నివేదికను హిండెన్‌బర్గ్‌ ముందే లీక్‌ చేసింది.. లాభాల్లో వాటా తీసుకుంది’

అదానీ గ్రూప్‌ అవకతవకలకు పాల్పడుతోందంటూ రూపొందించిన నివేదికను అమెరికా షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ ముందే తమ క్లయింట్లతో పంచుకుందని సెబీ ఆరోపించింది. నివేదిక విడుదల తర్వాత ఆయా క్లయింట్లు షార్ట్‌ పొజిషన్ల ద్వారా ఆర్జించిన లాభాల్లో వాటా తీసుకుందని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఎన్సీడబ్ల్యూ ఫిర్యాదు.. ఎంపీ మహువా మొయిత్రాపై కేసు నమోదు

జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రేఖా శర్మపై ‘ఎక్స్‌’ వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్సీడబ్ల్యూ ఫిర్యాదు మేరకు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్‌ 79 ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. రిషికేశ్‌లో ఉప్పొంగుతున్న గంగ.. ఘాట్‌ల వద్దకు వెళ్లొద్దని హెచ్చరికలు

ఉత్తరాఖండ్‌లో వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గంగా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఆదివారం నాటికి నీటిమట్టం రిషికేశ్‌లోని  త్రివేణి ఘాట్‌, గంగా హారతి ప్రాంతాల్లో ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. దీంతో రాత్రివేళల్లో ఘాట్‌ల వద్దకు పర్యాటకులెవరూ వెళ్లొద్దని రాష్ట్ర విపత్తుల ప్రతిస్పందన దళం (SDRF) హెచ్చరికలు జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. యుద్ధానికి తొమ్మిది నెలలు.. నెతన్యాహుకు నిరసన సెగలు!

హమాస్‌ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లో మారణహోమం సృష్టించి.. 250 మందికిపైగా పౌరులను బందీలుగా తీసుకెళ్లిన విషయం తెలిసిందే. దీంతో హమాస్‌ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ ప్రతిదాడులు చేపట్టింది. ఇలా గాజాలో యుద్ధం ప్రారంభమై నేటికి తొమ్మిది నెలలు పూర్తయ్యింది. ఈ క్రమంలోనే బందీలను విడిపించాలంటూ ఇజ్రాయెల్‌లో నిరసనకారులు కదం తొక్కారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఉక్రెయిన్‌ ప్రతిదాడులు.. రష్యాలో పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ!

రష్యా చేస్తున్న దాడులను దీటుగా ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌.. డ్రోన్లు, క్షిపణి దాడులతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో ఇటీవల చేసిన డ్రోన్ల దాడితో రష్యాలోని మందుగుండు గోదాముల్లో మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో వొరోనెజ్‌ ప్రాంతంలో పలుచోట్ల అత్యవసర స్థితి విధించారు. ప్రధాని మోదీ రష్యా పర్యటనకు ఒక రోజు ముందు రష్యాలో ఈ పరిణామం చోటుచేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని