Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 10 Jul 2024 21:02 IST

1. సోషల్‌ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు.. యూట్యూబర్‌ ప్రణీత్‌ అరెస్ట్‌

స్నేహితులతో వీడియో చాటింగ్‌ చేస్తూ అసభ్యకర మాటలతో రెచ్చిపోయిన యూట్యూబర్‌ ప్రణీత్‌ హనుమంతు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. తండ్రీకూతుళ్ల బంధంపై విచక్షణ మరచిమాట్లాడాడు. బెంగళూరులో ప్రణీత్‌ను తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకుని స్థానిక కోర్టులో హాజరుపర్చారు. అక్కడి నుంచి హైదరాబాద్‌ తీసుకొస్తున్నట్టు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఏపీలో చమురు శుద్ధి కర్మాగారం, పెట్రోకెమికల్‌ కారిడర్‌ ఏర్పాటుకు కృషి: చంద్రబాబు

ఏపీలో దాదాపు రూ.70 వేల కోట్ల పెట్టుబడితో చమురు శుద్ధి కర్మాగారం, పెట్రోకెమికల్‌ కారిడర్‌ ఏర్పాటుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. బుధవారం భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటిడ్‌(బీపీసీఎల్‌) ఛైర్మన్‌, ఎండీ కృష్ణకుమార్‌ నేతృత్వంలోని ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. తెలంగాణలో 15 మంది ఐపీఎస్‌ల బదిలీలు

తెలంగాణ రాష్ట్రంలో 15 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైల్వేస్‌, రోడ్‌ సేఫ్టీ అదనపు డీజీపీగా ఉన్న మహేశ్‌ భగవత్‌ను బదిలీ చేసి శాంతిభద్రతల అదనపు డీజీపీగా నియమించింది. హోంగార్డులు, ఆర్గనైజేషన్‌ అదనపు డీజీగా స్వాతి లక్రా, గ్రేహౌండ్స్‌ ఏడీజీగా స్టీఫెన్‌ రవీంద్రను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. రెండు నెలల్లో హైదరాబాద్‌-విజయవాడ రహదారి విస్తరణ పనులు

తెలంగాణలో రహదారుల నిర్మాణంపై బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌-విజయవాడ రహదారి విస్తరణ వెంటనే చేపట్టాలని అధికారులకు సూచించారు. కాగా.. హైదరాబాద్‌-విజయవాడ రహదారి విస్తరణ పనులు 2 నెలల్లో ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వీధి కుక్కల నియంత్రణకు కమిటీ.. జీహెచ్‌ఎంసీకి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌లో వీధి కుక్కల నియంత్రణపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కుక్కల నియంత్రణకు వారంలోగా నిపుణుల కమిటీ వేయాలని జీహెచ్‌ఎంసీని ఆదేశించింది. ఉదాసీనంగా వ్యవహరించేవారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేసింది. వీధి కుక్కల దాడిలో బాలుడి మృతిపై దాఖలైన పిల్‌పై ఉన్నత న్యాయస్థానం బుధవారం విచారణ జరిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. డియోన్ మేయర్స్ పోరాటం వృథా.. జింబాబ్వేపై భారత్‌ విజయం

జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో భారత్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో జింబాబ్వే 6 వికెట్ల నష్టానికి 159 పరుగులకు పరిమితమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7.  భారత్‌-రష్యా సంబంధాలపై.. అమెరికా ఏమన్నదంటే!

రష్యాతో భారత్‌ సన్నిహిత సంబంధాలు కొనసాగించడంపై ఆందోళనలు ఉన్నప్పటికీ.. భారత్‌తో తమ వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుందని అగ్రరాజ్యం స్పష్టం చేసింది. ఆ రెండు దేశాల మధ్య సంబంధాలు ఎంతోకాలంగా ఉన్నవేనని గుర్తుచేసింది. ఉక్రెయిన్‌ సంక్షోభం వేళ ప్రధాని నరేంద్రమోదీ మాస్కో పర్యటనను పాశ్చాత్యదేశాలు ఆసక్తిగా గమనించిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ‘అవసరమైతే.. మీ కాళ్లు మొక్కుతా’.. CM చర్యతో అధికారులు అవాక్కు!

బిహార్‌లో ఓ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని ఓ ప్రైవేటు కంపెనీ ప్రతినిధికి ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ విజ్ఞప్తి చేశారు. అందుకోసం అవసరమైతే ఆయన పాదాలకు నమస్కరిస్తానంటూ సీఎం ముందుకు వెళ్లడంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. 2 గంటలు, 5189 రౌండ్ల కాల్పులు.. సైన్యం ప్రతిఘటనతో ఉగ్రవాదులు పరార్‌!

జమ్మూ-కశ్మీర్‌లో సైనిక వాహనంపై ఉగ్రవాదులు మెరుపుదాడి జరిగిన విషయం తెలిసిందే. సాయుధ మూకలు దాడి మొదలుపెట్టిన వెంటనే భారత సైన్యం.. ప్రతిదాడులతో విరుచుకుపడింది.  ‘22 గడ్వాల్‌ రెజిమెంట్‌’ దాదాపు 5189 రౌండ్ల కాల్పులు జరిపినట్లు వెల్లడైంది. దాంతో తోకముడిచిన ఉగ్రమూకలు సమీప అడవుల్లోకి పారిపోయినట్లు తెలిసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మీ వస్తువులు మరిచిపోరిక.. రిలయన్స్‌ నుంచి జియో ట్యాగ్‌ ఎయిర్‌

రిలయన్స్‌ జియో మరో స్మార్ట్‌ పరికరాన్ని తీసుకొచ్చింది. గతంలో తీసుకొచ్చిన జియో ట్యాగ్‌కు కొనసాగింపుగా జియో ట్యాగ్‌ ఎయిర్‌ను తాజాగా లాంచ్ చేసింది. తాళాలు, లగేజీ, వాలెట్‌, పెంపుడు జంతువులు మిస్‌ అవ్వకుండా ఉండేందుకు ఈ స్మార్ట్‌ డివైజ్‌ పనికొస్తుంది. ఇందులో ఫైండ్‌ డివైజ్‌ ఫీచర్‌ ద్వారా ఆయా వస్తువులను ఎక్కడున్నా గుర్తించొచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని