Top Ten News @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 26 Jun 2021 13:08 IST

1. MAA Election: నాగబాబు మాటలు బాధించాయి

‘‘మా’ మసకబారిపోయింది’’ అంటూ నటుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఎంతో బాధించాయని మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నరేశ్‌ అన్నారు. నాగబాబు తనకి మంచి మిత్రుడని.. ‘మా’ చేపట్టిన అన్ని అభివృద్ధి కార్యక్రమాల గురించి సినీ పెద్దలందరికీ ఎప్పటికప్పుడు సమాచారం అందించామని నరేశ్‌ తెలిపారు. తన ప్యానల్‌ని పరిచయం చేస్తూ తాజాగా నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి కౌంటర్‌గా శనివారం ఉదయం నరేశ్‌ మీడియా ముందుకు వచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

MAA Election: ప్రకాశ్‌రాజ్‌పై ఆర్జీవీ వరుస ట్వీట్లు

2. AP: ఏపీపీఎస్సీ పరీక్షల్లో ఇంటర్వ్యూలు ఉండవ్‌:ఏపీ

ఏపీపీఎస్సీ పోటీపరీక్షల్లో ఇంటర్వ్యూలు ఎత్తి వేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్‌ 1 సహా అన్ని కేటగిరీ పోస్టులకు ఇంటర్వూలు రద్దు చేసినట్లు వెల్లడించింది. ఈమేరకు  సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగాల ఎంపికలో ఇకనుంచి ఇంటర్వ్యూలు ఉండబోవని చెప్పారు.పోటీ పరీక్షల్లో పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. TS news: నీటి చౌర్యాన్ని అడ్డుకుంటాం: పువ్వాడ

ఏపీ నీటి చౌర్యాన్ని అడ్డుకుంటామని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ స్పష్టం చేశారు. దీనిపై ఇప్పటికే ఎన్జీటీకి ఫిర్యాదు చేశామని, కేంద్రంతోనూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతున్నారని అన్నారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యల్లో తప్పులేదని, వైఎస్‌ దొంగ అయితే.. జగన్‌ గజదొంగ అనే వ్యాఖ్యలను తాను సమర్థిస్తున్నానని అన్నారు. తెలుగు రాష్ట్రాలు బాగుండాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారని, జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వయంగా ఇంటికి ఆహ్వానించారని గుర్తు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

TS: ఎక్కడైనా ఇలాంటి ఇళ్లు ఇచ్చారా?

4. అనిల్‌ దేశ్‌ముఖ్‌పై బిగుస్తున్న ఉచ్చు

ఎన్సీపీ సీనియర్‌ నేత, మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై ఈడీ ఉచ్చు బిగుస్తోంది. ఆయన నివాసాలు, కార్యాలయాలపై శుక్రవారం దాడులు నిర్వహించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు.. దేశ్‌ముఖ్‌ వ్యక్తిగత సిబ్బంది, వ్యక్తిగత కార్యదర్శిని అరెస్టు చేశారు. తాజాగా ఆయనకు సమన్లు కూడా జారీ అయ్యాయి. మనీలాండరింగ్‌ కేసులో శనివారం ఉదయం విచారణకు హాజరుకావాలంటూ ఈడీ సమన్లు జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Team India: శుభ్‌మన్‌గిల్‌ వీవీఎస్‌ లాంటోడు

టీమ్‌ఇండియా యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌గిల్‌ మాజీ స్టైలిష్‌ బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ లాంటి ఆటగాడని, అతడు ఓపెనర్‌గా కాకుండా మిడిల్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేయాలని మాజీ సెలెక్టర్‌ గగన్‌ఖోడా అభిప్రాయపడ్డారు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో భారత్‌ 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గిల్‌ 28, 8 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో ఖోడా ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

పాలిచ్చే అమ్మగానా? పోటీపడే అథ్లెట్‌గానా?  

6. Petrol: హైదరాబాద్‌లో రూ.102.. ముంబయిలో రూ.104

దేశంలో ఇంధన ధరల పెరుగుదలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. వరుస పెంపులతో కొత్త రికార్డులను తాకుతున్న చమురు ధరలతో వాహనదారుల గుండెలు గుబేలుమంటున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పెట్రోల్‌ ధర సెంచరీ దాటేసి పరుగులు పెడుతోంది. శనివారం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను చమురు ఉత్పత్తి సంస్థలు మరోసారి పెంచాయి. దీంతో దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.104 దాటగా.. హైదరాబాద్‌లో రూ.102కు చేరువైంది. దేశ రాజధాని దిల్లీలో పెట్రోల్‌ ధర రూ.98 దాటేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Delta: టీకాలు వేసుకోని వారిలో వేగంగా వ్యాప్తి

కరోనాలో పుట్టుకొచ్చిన అనేక రకాల్లో ‘డెల్టా’ వేరియంటే అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోన్న రకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ టెడ్రస్‌ అధానోమ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేగాక, టీకాలు వేసుకోనివారే ఎక్కువగా దీని బారిన పడుతున్నారని ఆయన హెచ్చరించారు.  ‘‘డెల్టా వేరియంట్‌పై యావత్ ప్రపంచం కలవరపడుతోంది. డబ్ల్యూహెచ్‌ఓ కూడా దీనిపై ఆందోళన చెందుతోంది. ఇప్పటివరకు గుర్తించిన అన్ని కరోనా రకాల్లో ఇదే అత్యంత వేగంగా వ్యాపిస్తోన్న వేరియంట్‌’’ అని టెడ్రస్‌ చెప్పుకొచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

* Corona: రెండోసారి..50వేలలోపు కేసులు

8. NASA: వ్యోమగామి ఎక్కడున్నాడో చెప్పగలరా..?

అంతరిక్షంలో మనిషి కదలిక ఎప్పుడూ ఆసక్తికరమే. అంతరిక్ష యాత్ర, స్పేస్‌వాక్‌.. ఇలా ప్రతి ప్రయాణమూ మనకు అబ్బురమే. తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) షేర్‌చేసిన వీడియో ఆ కోవలోనిదే. భూమికి 410 కిలోమీటర్ల ఎత్తులో నుంచి తీసిన ఓ అద్భుత దృశ్యాన్ని నాసా నెటిజన్లతో పంచుకుంది. ఇద్దరు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో విద్యుత్‌ సరఫరాను మెరుగుపర్చే సమయంలో తీసిన వీడియో అది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. TS news: మావోయిస్టు హరిభూషణ్ భార్య మృతి!

ఇటీవల మరణించిన మావోయిస్టు హరిభూషణ్‌ భార్య, మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యురాలు జజ్జర్ల సమ్మక్క అలియాస్‌ శారద తీవ్ర మృతి చెందినట్లు సమాచారం. ఈ నెల 24న ఆమె కరోనాతో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మావోయిస్టు చర్ల, శబరి ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేసిన శారద డీసీఎంగా ఉన్నతి పొందారు. కరోనా మహమ్మారి శారదను కుంగదీసినట్లుగా తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

AP news: సినీనటుడు కత్తి మహేశ్‌కు గాయాలు

10. Ap news: దుర్మార్గాలకు చిరునామాగా మార్చేశారు

చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం ఆర్‌.నడింపల్లిలో తెదేపా నేత మునెప్పపై వైకాపా నేతలు కత్తులతో దాడి చేశారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. మునెప్ప భూమిని కబ్జా చేయటంతోపాటు అడ్డుకున్నందుకు మారణాయుధాలతో దాడులకు తెగబడ్డారని ఆరోపించారు. మునెప్పకు పార్టీ అండగా ఉండటంతోపాటు దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకునే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు అచ్చెన్న ప్రకటన విడుదల చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని