oscars 2023: ఆస్కార్‌ అవార్డులపై టాప్‌ 10 ప్రత్యేక కథనాలివే..!

Top Ten News on Oscar Awards: ఈనాడు.నెట్‌లోని ఆస్కార్‌ అవార్డులపై పది ముఖ్యమైన కథనాలు..

Updated : 13 Mar 2023 17:11 IST

1. ఆస్కార్‌ సాధించిన సినిమాలు.. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్నాయంటే!

ప్రస్తుతం ఎక్కడ విన్నా ఆస్కార్ (Oscars 2023) అవార్డుల గురించే. ఈ వేడుక లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఘనంగా జరిగింది. దీంతో ఆస్కార్‌ అవార్డులు గెలిచిన చిత్రాలు.. ఇప్పుడు ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్‌ అవుతున్నాయో అభిమానులు తెగ వెతికేస్తున్నారు.ఆస్కార్‌లో ఏకంగా ఏడు అవార్డులను సొంతం చేసుకొని రికార్డు సృష్టించిన సినిమా ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ‘డు యూ నో నాటు’.. ఆస్కార్‌ వేదికపై పాటను పరిచయం చేసిన దీపిక

భారతీయ సినీ రంగంలో సువర్ణాధ్యాయాన్ని లిఖిస్తూ తెలుగు పాట ‘నాటు నాటు’ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఉత్తమ ఒరిజినల్‌ స్కోర్‌ విభాగంలో ఆస్కార్‌ (oscars 2023) పురస్కారాన్ని అందుకుంది. దీంతో లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌ ‘నాటు నాటు (Naatu Naatu)’తో దద్దరిల్లింది. ఈ అవార్డు ప్రకటనకు ముందు ఈ పాటను ప్రముఖ బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె (Deepika Padukone) పరిచయం చేయగా.. ఆ తర్వాత గాయకులు రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ లైవ్‌లో పాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఆస్కార్‌.. ‘ఎవ్రీథింగ్‌’ వారికే.. ఏకంగా ఏడు అవార్డులు.. విజేతల పూర్తి జాబితా ఇదే!

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసిన ‘ఆస్కార్‌’ (Oscars 2023) అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన ఈ వేడుకల్లో ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’ (everything everywhere all at once) చిత్రం ఏకంగా ఏడు అవార్డులను అందుకుని విజయకేతనం ఎగురవేసింది.  ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి అవార్డులు ఆ చిత్రానికే వరించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఎన్టీఆర్‌.. నీతో మళ్లీ డ్యాన్స్‌ చేయాలని ఉంది: రామ్‌చరణ్‌

‘నాటు నాటు’ (Naatu Naatu) పాటకు ఆస్కార్‌ (Oscars 2023) వరించడం పట్ల రామ్‌చరణ్‌ (Ram Charan) ఆనందం వ్యక్తం చేశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ మొత్తానికి ధన్యవాదాలు చెబుతూ ఆయన ఓ ఎమోషనల్‌ నోట్‌ షేర్‌ చేశారు. మరోసారి తారక్‌ (NTR)తో డ్యాన్స్‌ చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. అలాగే, ఈ అవార్డు భారతీయ నటీనటులందరి సొంతమని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పుతిన్‌ ప్రత్యర్థిపై సినిమాకు ఆస్కార్‌.. ఎవరీ నవానీ?

ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ (Oscars 2023) పురస్కారాల ప్రదానోత్సవం సోమవారం అట్టహాసంగా జరిగింది. లాజ్‌ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో 95వ అకాడమీ అవార్డులను నేడు ప్రకటించారు. ఇందులో ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ విభాగంలో ‘నవానీ (Navalny)’ చిత్రం ఆస్కార్‌ అందుకుంది. ఈ సినిమాకో ప్రత్యేకత ఉంది. రష్యా (Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Putin) విమర్శకుడు, ఆ దేశ ప్రతిపక్ష నేత అలెక్సీ నవానీ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఆయన ధైర్యమే ఆస్కార్‌ కల నెరవేరేలా చేసింది.. ప్రముఖుల ప్రశంసలు

ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఆస్కార్‌’ (Oscars 2023) అవార్డు ఈ ఏడాది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR)లోని ‘నాటు నాటు’ (Naatu Naatu) (బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరి) పాటకు రావడం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్ల నాటి కల నేడు సాకారమైందన్నారు. ఈ మేరకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ను ప్రశంసిస్తూ సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7.  ఆస్కార్‌ అవార్డు అంటే ఏంటో తెలియదు.. ‘ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌’ నటి బెల్లీ

దిక్కులేని ఏనుగులను (Elephants) ఆదరించి, వాటి సంరక్షణ చూసుకునే ఓ దంపతుల ఇతివృత్తంగా తెరకెక్కిన భారతీయ లఘుచిత్రం (The Elephant Whisperers) ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ అవార్డు (Oscar 2023) పొంది యావత్‌ ప్రపంచాన్ని ఆకర్షించింది. ఇంత గొప్ప అవార్డు (95th Academy Awards) రావడంపై దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు ఎంతో గర్వంగా భావిస్తూ.. సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8.  ఆస్కార్‌ వేడుకలో ఈ కీలక మార్పు గమనించారా..!

కొన్ని కోట్లమంది కలను నెరవేరుస్తూ విశ్వవేదికపై ‘నాటు నాటు’ పాట ఆస్కార్‌ అవార్డును సొంతం చేసుకుంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ తెలుగు చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) భారతీయులంతా గర్వపడేలా చేసింది. ఆస్కార్‌ వేడుక అనగానే అందరికీ గుర్తొచ్చే వాటిల్లో రెడ్‌ కార్పెట్‌ (red carpet) ఒకటి.  దీనిపై నడవడానికి ప్రముఖులు సైతం ఆసక్తి చూపుతారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ‘నాటు నాటు’.. మిలియన్లలో వ్యూస్‌ అందుకొన్న ఈ కవర్‌సాంగ్స్‌ చూశారా..!

‘నాట్‌ సాల్సా.. నాట్‌ ఫ్లేమెన్కో మై బ్రదర్‌.. ఇట్స్‌ అవర్‌ ఓన్‌ నాటు నాటు’.. ఇప్పుడు తెలుగు సినీ ప్రియులందరి (Tollywood Movie Lovers) నోట ఇదే మాట వినపడుతోంది. ప్రపంచ ప్రఖ్యాత ‘ఆస్కార్‌’ (Oscars) అవార్డును ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) చిత్రంలోని ‘నాటు నాటు’ (Naatu Naatu) దక్కించుకుంది. ‘నాటు నాటు’కు తాము చేసిన కవర్‌ సాంగ్స్‌ను సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేస్తూ టీమ్‌కు అభినందనలు తెలుపుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. 6. ఆస్కార్‌ వేడుకల్లో అందాల తారలు

ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి వివిధ దేశాల నటీమణులు హాజరై సందడి చేశారు. అందులో కొందరి ఫొటోలు మీకోసం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు