Top 10 News @1PM

ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన పది వార్తల కోసం క్లిక్ చేయండి

Updated : 29 Apr 2021 13:09 IST

1. India corona: ఒక్కరోజే 3,645 మంది మృతి!

దేశంలో కరోనా వైరస్‌ రెండో దశ వ్యాప్తి ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 17.68లక్షల టెస్టులు చేయగా 3,79,257కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ గురువారం వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,83,76,524కు చేరింది. కొత్తగా 2,69,507మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 1,50,86,878 చేరి, 82.33శాతానికి చేరింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

2. ప్రజల ప్రాణాలు విలువైనవా? ఎన్నికలా: హైకోర్టు

రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై హైకోర్టు మరోసారి అసహనం వ్యక్తంచేసింది. కరోనా పరిస్థితులపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. మినీ పుర పోరు నిర్వహణపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వ అభిప్రాయం అడగాల్సిన అవసరం ఏంటని ఎస్‌ఈసీని ప్రశ్నించింది. కరోనా నియంత్రణపై ప్రభుత్వ తీరునూ తప్పుబట్టింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

3. Corona చికిత్స ఆరోగ్యశ్రీలో చేర్చండి

ఇటీవల కరోనా బారిన పడిన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆస్పత్రి నుంచి ట్విటర్‌లో వీడియో సందేశం పోస్ట్‌ చేశారు. తన ఆరోగ్యం గురించి ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రజల దీవెనలతో రెండు మూడు రోజుల్లో డిశ్చార్జి అయి ఇంటికి వస్తానని పేర్కొన్నారు. పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు. ప్రజలకు వైద్య సేవలు అందించడం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత అన్నారు. కరోనాకు చికిత్సను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

4. సీఐడీ విచారణకు హాజరైన దేవినేని ఉమా

సీఎం జగన్‌ మాటల మార్ఫింగ్‌ వీడియో కేసులో తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సీఐడీ విచారణకు హాజరయ్యారు. గురువారం ఉదయం మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. సీఎం జగన్‌ మాటలను మార్ఫింగ్‌ చేశారనే ఆరోపణలపై తనపై తప్పుడు కేసులు బనాయించారని దేవినేని అన్నారు. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

5. CoronaVaccineపై జీఎస్‌టీ తొలగింపు?

రోనా వ్యాక్సిన్‌ ధరలపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ప్రజలపై భారం తగ్గించేలా టీకాలపై కేంద్ర ప్రభుత్వం వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) తొలగించే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. దీని వల్ల టీకా ధరలు తగ్గితే ఎక్కువ మంది ప్రయివేటుగా వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు ముందుకొస్తారని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

6. భారత్‌లోని అమెరికా పౌరులకు కీలక సూచన!

భారత్‌లో ఉన్న యూఎస్‌ పౌరులకు ఆ దేశ ప్రభుత్వం కీలక సూచన చేసింది. కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వీలైనంత తొందరగా భారత్‌ను వదిలేయడం సురక్షితమని పౌరులకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు అమెరికా రాయబార కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. భారత్‌లో కొవిడ్‌ కేసులు రికార్డు స్థాయిలో విజృంభిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో టెస్టింగ్‌కు సంబంధించి మౌలిక సదుపాయాల కొరత ఉందని వ్యాఖ్యానించింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

7. ఓటమికి పూర్తి బాధ్యత నాదే: వార్నర్‌

న్నై మళ్లీ అదరగొట్టింది. బుధవారం దిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ధోనీసేన 7 వికెట్ల తేడాతో విక్టరీ సాధించింది. ఈ విజయంతో చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో తిరిగి అగ్రస్థానానికి చేరుకుంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్‌ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (57; 55 బంతుల్లో 3×4,, 2×6) అర్ధశతకం సాధించాడు. కానీ, తనదైన శైలిలో దూకుడుగా ఆడలేకపోయాడు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

8. CoronaEffect: చార్‌ధామ్‌ యాత్ర రద్దు

ఉత్తరాఖండ్‌లో ఏటా జరిగే చార్‌ధామ్‌ యాత్రను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రద్దు చేసింది. రాష్ట్రంలో కొవిడ్‌ ఉద్ధృతి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి తీరథ్‌ సింగ్‌ రావత్‌ గురువారం ప్రకటించారు. నాలుగు ఆలయాల్లోకి భక్తులెవరినీ అనుమతించేది లేదని, కేవలం అర్చకులే పూజాకార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు. ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌,యమునోత్రి, గంగోత్రిలను కలిపి చార్‌ధామ్‌లుగా పిలుస్తారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

9. ‘కట్టె’కు కట్టె కరవు!

దేశరాజధాని దిల్లీలో పరిస్థితులు రోజురోజుకీ దయనీయంగా మారిపోతున్నాయి. ఇప్పటివరకు శ్మశానాల్లో చితి పేర్చడానికి స్థలం దొరక్క ఇబ్బందులు పడుతున్న దిల్లీ వాసులు ఇప్పుడు ఆప్తుల భౌతికకాయాలను కాల్చడానికి కట్టెలు సైతం దొరకని దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. లెక్కకు మించిన భౌతికకాయాలు మరుభూములకు వరుస కడుతుండడంతో కాటికాపరులు సైతం చేతులెత్తేస్తున్నారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

10. డెలివరీకి వారం ముందు కరోనా

సరిగ్గా మరో వారంలో డెలివరీ అనగా.. తాను కరోనా బారినపడ్డానని నటి, ప్రముఖ బుల్లితెర వ్యాఖ్యాత హరితేజ తెలిపారు. ఇటీవల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆమె తాజాగా ఇన్‌స్టా వేదికగా ఓ భావోద్వేగ వీడియోని షేర్‌ చేశారు. డెలివరీ సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి అభిమానులతో పంచుకొన్నారు. డెలివరీకి కొన్నిరోజుల ముందు ఇంటిల్లిపాది కొవిడ్‌బారిన పడడంతో తాను ఎంతో బాధపడ్డానని ఆమె అన్నారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని