Top Ten News: ఒడిశా రైలు విషాదం.. టాప్‌ టెన్‌ కథనాలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 03 Jun 2023 13:18 IST

1. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు.. ఏపీకి చెందిన వారి వివరాలివే..

ప్రమాదానికి గురైన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారి వివరాలను రైల్వే శాఖ వెల్లడించింది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో షాలిమర్‌లో 39 మంది, సంత్రగచిలో ఆరుగురు, ఖరగ్‌పూర్‌లో ముగ్గురు రైలు ఎక్కినట్లు అధికారులు తెలిపారు. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఏపీకి మొత్తం 48 మంది ప్రయాణికులు రావాల్సి ఉందని వెల్లడించారు. వీరిలో 16 మంది మహిళలు ఉన్నట్లు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. సరిగ్గా 14 ఏళ్ల క్రితం.. ఇదే శుక్రవారం..!

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా భారీ సంఖ్యలో ప్రయాణికులు బోగీల కింద చిక్కుకొని ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుత ఘటన 2009 నాటి రైలు ప్రమాదాన్ని గుర్తుకుతెస్తోంది. అప్పుడు కూడా సరిగ్గా శుక్రవారం రాత్రి ఏడుగంటల సమయంలో ఇదే కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3.  బోగీలు గాల్లోకి లేచి.. ఒకదానిపై మరొకటి దూసుకెళ్లి..!

శుక్రవారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంతో ఒడిశా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. కోరమాండల్‌ ప్రయాణించే నాలుగు రాష్ట్రాలూ తీవ్ర అలజడికి గురయ్యాయి. ప్రమాదం జరిగిన తీరు, అక్కడి దృశ్యాలు కలవరపెడుతున్నాయి. ఒకరైలు బోగీపై మరొకటి వెళ్లిపోవడం, సహాయక సిబ్బంది మృతదేహాలన్నింటిని ఒక వరుసలో ఉంచిన దృశ్యాలు దుర్ఘటన తీవ్రతను తెలియజేస్తున్నాయి. కొన్ని మీడియా సంస్థల కథనం ప్రకారం.. (Odisha Train Tragedy) పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. విపత్తు వేళ మానవత్వం.. రక్తదానానికి కదిలొచ్చిన యువకులు

ఒడిశా (Odisha)లోని బాలేశ్వర్‌ జిల్లాలో మూడు రైళ్లు ఢీ కొన్న ఘటన వందలాది కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. ఈ విపత్కర పరిస్థితుల్లో కొందరు స్థానికులు మానవత్వాన్ని చాటుకున్నారు. గాయపడిన వారికి రక్తం అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. (Odisha Train Targedy) పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాద దుర్ఘటన.. డ్రోన్‌ విజువల్స్‌

ఒడిశాలో మాటలకందని మహా విషాదం చోటుచేసుకుంది. బాలేశ్వర్‌ జిల్లాలో శుక్రవారం అనూహ్య రీతిలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 238 మంది దుర్మరణం పాలయ్యారు. 900 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించి డ్రోన్‌ విజువల్స్‌.. అక్కడి భీతావహ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటన.. 278కి చేరిన మృతుల సంఖ్య

ఒడిశా (Odisha) రాష్ట్రంలోని బాలేశ్వర్‌ జిల్లాలో రైలు పట్టాలపై సంభవించిన మృత్యుఘోషలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 278 మంది దుర్మరణం చెందినట్లు అధికారులు వెల్లడించారు. వందల మంది గాయపడగా.. వారిని సమీపంలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. (Odisha Train Tragedy) పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అంతా 20 నిమిషాల వ్యవధిలోనే.. నిద్రలోనే మృత్యుఒడిలోకి..!

 ఒడిశా రాష్ట్రంలోని బాలేశ్వర్‌ జిల్లాలో మూడు రైళ్లు ఢీ కొనడం పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో 238 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో ప్రయాణికులు గాయపడగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కేవలం నిమిషాల వ్యవధిలోనే పట్టాలపై ఈ భారీ విషాదం చోటుచేసుకుందని తెలుస్తోంది. అధికారులు, ప్రత్యక్ష సాక్షులు వెల్లడించిన వివరాల ప్రకారం.. (Odisha Train Tragedy) పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. ఆ మార్గంలో ‘కవచ్‌’ సౌకర్యం లేదు : అమితాబ్‌ శర్మ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని