Polavaram: 50 ఎకరాల్లోని వరి కుప్పలు దగ్ధం

ఏలూరు జిల్లా పోలవరం మండలంలో దాదాపు 50 ఎకరాల్లోని వరికుప్పలు దగ్ధమయ్యాయి.

Updated : 16 May 2023 16:07 IST

పోలవరం: ఏలూరు జిల్లా పోలవరం మండలం కొత్త పట్టి సీమకు సమీపంలో మంగళవారం మధ్యాహ్నం మొక్కజొన్న పొలంలో మంటలు వ్యాపించి దాదాపు 50 ఎకరాల్లోని వరి కుప్పలు దగ్ధమయ్యాయి. ప్రస్తుతం మొక్కజొన్న వేసిన పొలంలో ఖరీఫ్‌లో పండించిన వరి కుప్పలు వేశారు. మరో రెండు మూడు రోజుల్లో ఆ కుప్పలను నూర్చే ప్రయత్నంలో రైతులు ఉండగా అకస్మాత్తుగా ఈ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 20 కుప్పలు కాలిపోయినట్లు రైతులు చెబుతున్నారు. ఎండ తీవ్రతకు తోడు ఈదురుగాలులు వీయడంతో క్షణాల్లో కుప్పలన్నీ కాలి బూడిదయ్యాయి. అప్పటికే ఇళ్లకు చేరుకున్న రైతులకు విషయం తెలియడంతో పరుగు పరుగున వెళ్లి కాలిపోయిన వరి కుప్పలను చూసి కన్నీరుమున్నీరయ్యారు. వరి కుప్పలతోపాటు అక్కడక్కడ మొక్కజొన్న పంటకు కూడా మంటలు అంటుకోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే అధికారులు, ప్రజాప్రతినిధులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని