Telangana: రాష్ట్రంలో 53 మంది పోలీసు అధికారులకు పదోన్నతి
తెలంగాణలో 53 మంది పోలీసులు అధికారులకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది.
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా వివిధ చోట్ల అదనపు ఎస్పీలుగా, డీఎస్పీలుగా విధులు నిర్వర్తిస్తున్న పోలీసు అధికారులకు తెలంగాణ ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. అదనపు ఎస్పీలుగా విధులు చేపడుతున్న 18 మందికి ఎస్పీలుగా, మరో 35 మంది డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా పదోన్నతి కల్పించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన అధికారులు డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలన్నారు. 15 రోజుల్లోగా నూతన విధుల్లో చేరాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పదోన్నతి పొందిన వారిలో కరీంనగర్ అదనపు ఎస్పీ జి. చంద్రమోహన్, హైదరాబాద్ నగర అదనపు డీసీపీ ప్రసాద్ కర్రోల్ల, అదనపు ఎస్పీ (వెయిటింగ్) కిషన్ సింగ్ ధీరావత్ తదితరులు ఉన్నారు.
ఎస్పీలుగా పదోన్నతి పొందిన అధికారుల జాబితా
అదనపు ఎస్పీలుగా పదోన్నతి పొందిన అధికారులు
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
అమ్మకు రాహుల్ ‘బుజ్జి నూరీ’ కానుక!
-
సినిమాల కోసం ‘ఐఏఎస్’ త్యాగం!
-
కరుణానిధి సంభాషణలా.. అమ్మబాబోయ్!
-
సల్మాన్ సినిమా ఫ్లాప్.. నన్ను చచ్చిపోమన్నారు: హీరోయిన్
-
CBFC: విశాల్ ఆరోపణలు.. సెన్సార్ బోర్డు కీలక నిర్ణయం.. అదేంటంటే?
-
Google Bard - Team India: వన్డే ప్రపంచకప్.. గూగుల్ బార్డ్ చెప్పిన భారత్ తుది జట్టు ఇదే