పురుషులను లాఠీలతో చితకబాదిన మహిళలు

ఉత్తరప్రదేశ్‌లోని మథురలో హోలీ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. సంప్రదాయంగా నిర్వహించే ‘లాఠీ మార్‌’ వేడుకలు అలరిస్తున్నాయి. రంగులు చల్లుకుంటూ ఆడుకోవడంతోపాటు మహిళలు మగవారిని కర్రలతో కొట్టడం ఈ లాఠీ మార్‌ హోలీ ప్రత్యేకత....

Updated : 24 Mar 2021 17:29 IST

ఉత్తరప్రదేశ్‌లోని మథురలో వింత ఆచారం

మథుర: ఉత్తరప్రదేశ్‌లోని మథురలో హోలీ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. సంప్రదాయంగా నిర్వహించే ‘లాఠీ మార్‌’ వేడుకలు అలరిస్తున్నాయి. రంగులు చల్లుకుంటూ ఆడుకోవడంతోపాటు మహిళలు మగవారిని కర్రలతో కొట్టడం ఈ లాఠీ మార్‌ హోలీ ప్రత్యేకత. రెండు రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహిస్తారు. మంగళవారం బర్సానాలో లాఠీ మార్‌ వేడుకలు నిర్వహించగా బుధవారం బర్సానా, నందగావ్‌లో వేడుకలు జరుపుకొన్నారు. ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. శ్రీకృష్ణుడు గోపికలతో హోలీ ఆడుతుండగా.. రాధా తదితరులు కృష్ణుడిని లాఠీలతోనూ, కర్రలతోనూ కొడతారట. ఈ లాఠీ మార్‌ దాడి నుంచి తప్పించుకునేందుకు పురుషులు కవచాలను కూడా ధరిస్తారు. లాఠీ మార్‌కు సంబంధించి దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని