Modi Tour: ఎల్లుండి హైదరాబాద్‌లో మోదీ పర్యటన.. ట్రాఫిక్‌ ఆంక్షలివే..

ఈనెల 26న గచ్చిబౌలిలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) వార్షికోత్సవానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరుకానున్న దృష్ట్యా సైబరాబాద్‌ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు.

Published : 24 May 2022 16:19 IST

హైదరాబాద్‌: ఈనెల 26న గచ్చిబౌలిలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) వార్షికోత్సవానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరుకానున్న దృష్ట్యా సైబరాబాద్‌ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఐఎస్‌బీకి 5 కి.మీ. పరిధిలో రిమోట్‌ కంట్రోల్‌ డ్రోన్లు, పారా గ్లైడింగ్‌, మైక్రో లైట్‌ ఎయిర్‌క్రాప్ట్స్‌ ఎగిరేందుకు నిషేధం విధించారు. ఇలాంటి వాటితో ఉగ్రదాడులు జరిగే ప్రమాదముందని ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) హెచ్చరించిందని.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈనెల 25న మధ్యాహ్నం 12 గంటల నుంచి 26వ తేదీ సాయంత్రం 6 గంటల వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు.

ప్రధాని పర్యటన దృష్ట్యా హైదరాబాద్‌ నగర పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు కూడా అమలుకానున్నాయి. 26న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇవి అమల్లో ఉండనున్నాయి.

*గచ్చిబౌలి స్టేడియం నుంచి ఐఐటీ కూడలి, ఐఐటీ కూడలి నుంచి విప్రో కూడలి వరకూ ఉన్న కంపెనీలు వారి పనివేళల్లో మార్పులు చేసుకోవాలి.
*గచ్చిబౌలి కూడలి నుంచి లింగంపల్లి వైపు వెళ్లే వాహనాలు బొటానికల్ గార్డెన్-కొండాపూర్ ఏరియా ఆస్పత్రి-మసీద్‌బండ-హెచ్‌సీయూ డిపో మీదుగా వెళ్లాలి.
*లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వచ్చే వాహనదారులు హెచ్‌సీయూ డిపో, మసీద్‌ బండ, కొండాపూర్ ఏరియా ఆస్పత్రి, బొటానికల్ గార్డెన్ మీదుగా..
*విప్రో కూడలి నుంచి లింగంపల్లికి వెళ్లేవారు క్యూ సిటీ, గౌలిదొడ్డి, గోపన్‌పల్లి క్రాస్ రోడ్‌, హెసీయూ వెనుక గేట్, నల్లగండ్ల మీదుగా వెళ్లాలి.
*విప్రో కూడలి నుంచి గచ్చిబౌలికి వెళ్లేవారు ఫెయిర్ ఫీల్డ్ హోటల్, నానక్ రామ్‌గూడ, రోటరీ, ఓఆర్ఆర్, ఎల్అండ్ టీ టవర్స్ మీదుగా..
*తీగల వంతెన నుంచి గచ్చిబౌలి కూడలికి వెళ్లేవారు రత్నదీప్, మాదాపూర్ పోలీస్టేషన్, సైబర్ టవర్స్, కొత్తగూడ, బొటానికల్ గార్డెన్ మీదుగా వెళ్లాలని పోలీసులు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని