Hyderabad: మేడ్చల్‌ మార్గంలో రోడ్డు కోత.. సుచిత్ర వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌

బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మేడ్చల్‌ మార్గంలో రోడ్డు కోతకు గురైంది. కొంపల్లి నుంచి దూలపల్లి వెళ్లే దారిలో రోడ్డు కోతకు గురికావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

Updated : 13 Oct 2022 14:08 IST

హైదరాబాద్‌: నగరంలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మేడ్చల్‌ మార్గంలో రోడ్డు కోతకు గురైంది. కొంపల్లి నుంచి దూలపల్లి వెళ్లే దారిలో రోడ్డు కోతకు గురికావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పెద్ద ఎత్తున వాహనాలు రోడ్లపైకి రావడంతో కొంపల్లి నుంచి మేడ్చల్‌ వెళ్లే మార్గంలో సుచిత్ర వద్ద ట్రాఫిక్‌ జామ్‌ అయింది. సుమారు 2 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ నియంత్రణకు చర్యలు చేపట్టారు. ప్రత్యా్మ్నాయ మార్గాల్లో వాహనాలను పంపించారు. 

మరోవైపు కొంపల్లి ప్రాంతంలో పలు కాలనీల ఇంకా నీటి ముంపులోనే ఉన్నాయి. ఇళ్లలోకి వరదనీరు చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆయా కాలనీల్లో పర్యటించారు. వరద నీరు బయటకు వెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని