Hyderabad: ప్రభాస్‌ కారుకు జరిమానా విధించిన జూబ్లీహిల్స్‌ పోలీసులు

ట్రాఫిక్‌ పోలీసులు ఎంత చెప్పినా పలువురు సెలబ్రిటీలు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూనే ఉన్నారు. తాజాగా నటుడు ప్రభాస్‌ కారుకు ట్రాఫిక్‌ పోలీసులు జరిమానా విధించారు. నగరంలోని జూబ్లీహిల్స్‌ రోడ్ నంబర్‌ 36లో నీరుస్ కూడలి వద్ద బ్లాక్‌ ఫ్రేమ్‌తో వెళ్తున్న కారు...

Published : 17 Apr 2022 01:59 IST

హైదరాబాద్: ట్రాఫిక్‌ పోలీసులు ఎంత చెప్పినా పలువురు సెలబ్రిటీలు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూనే ఉన్నారు. తాజాగా నటుడు ప్రభాస్‌ కారుకు ట్రాఫిక్‌ పోలీసులు జరిమానా విధించారు. నగరంలోని జూబ్లీహిల్స్‌ రోడ్ నంబర్‌ 36లో నీరుస్ కూడలి వద్ద బ్లాక్‌ ఫ్రేమ్‌తో వెళ్తున్న కారు పోలీసుల కంటపడింది. కారును ఆపి పరిశీలించగా.. ఆ కారు నటుడు ప్రభాస్‌దిగా తేలింది. నంబర్ ప్లేట్‌ సరిగ్గా లేకపోవడం, ఎంపీ స్టిక్కర్, బ్లాక్‌ ఫ్రేమ్‌ ఉండడంతో జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు రూ.1,450 చలానా వేశారు. పోలీసులు జరిమానా విధించిన సమయంలో ప్రభాస్‌ కారులో లేరు. నిబంధనలు ఉల్లంఘించారని గతంలో నటులు ఎన్టీఆర్‌, మంచు మనోజ్‌ల కార్లకు జరిమానా విధించిన ట్రాఫిక్‌ పోలీసులు వాటి కున్న బ్లాక్‌ ఫ్రేమ్‌లను తొలగించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని