Hyderabad: ఈనెల 9 నుంచి హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ సందర్భంగా హైదరాబాద్‌ నగరంలోని నెక్లెస్‌ రోడ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌లో  ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నారు.

Published : 07 Dec 2022 01:07 IST

హైదరాబాద్‌: ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ సందర్భంగా హైదరాబాద్‌ నగరంలోని నెక్లెస్‌ రోడ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌లో  ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో మరోసారి ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ నిర్వహించనున్న నేపథ్యంలో 9వ తేదీ ఉదయం 11 నుంచి 11న రేసింగ్‌ ముగిసే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని నగర పోలీసులు వెల్లడించారు. ఖైరతాబాద్‌ నుంచి ఐమాక్స్‌, తెలుగుతల్లి కూడలి వెళ్లే మార్గాలను మూసివేయనున్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని