Traffic: నేడు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

బక్రీద్‌ సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలను విధించారు. ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు పాతబస్తీలో ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు.

Published : 17 Jun 2024 09:48 IST

హైదరాబాద్‌: బక్రీద్‌ సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలను విధించారు. ఉదయం 11.30 గంటల వరకు పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మీరాలం ట్యాంక్‌ ఈద్గా, హాకీ గ్రౌండ్‌, మాసబ్‌ ట్యాంక్‌, లంగర్‌ హౌజ్‌ ప్రాంతాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తుండటంతో ఈ మార్గంలో ట్రాఫిక్‌ మళ్లిస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనదారులు వెళ్లాల్సిందిగా పోలీసులు సూచిస్తున్నారు. నగరంలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ప్రార్థనలు జరిగేలా చర్యలు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని