Published : 07 Jul 2022 18:04 IST

Andhra News: విజయవాడలో రెండ్రోజులు ట్రాఫిక్‌ ఆంక్షలు... చెన్నై, విశాఖ ఎలా వెళ్లాలంటే?

విజయవాడ: గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద వైకాపా ప్లీనరీ దృష్ట్యా ఈనెల 8, 9 తేదీల్లో 16వ జాతీయ రహదారిపై వాహనాలు దారిమళ్లిస్తున్నట్టు విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కాంతిరాణా,  గుంటూరు రేంజ్‌ డీఐజీ త్రివిక్రమ్‌ వర్మ తెలిపారు. వైకాపా ప్లీనరీ నేపథ్యంలో జాతీయ రహదారిపైకి ఇతర వాహనాలు రాకుండా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్టు చెప్పారు.  చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలు ప్రకాశం జిల్లా త్రోవగుంట నుంచి దారి మళ్లిస్తారు. చీరాల, బాపట్ల, రేపల్లె, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా వెళ్లాల్సి ఉంటుందన్నారు. గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలు బుడంపాడు మీదుగా తెనాలి, కొల్లూరు, పెనుమూడి వారధి, అవనిగడ్డ, పామర్రు, హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా మళ్లిస్తారు. విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లే వాహనాలు హనుమాన్‌ జంక్షన్‌ నుంచే దారి మళ్లించి గుడివాడ మీదుగా అవనిగడ్డ, రేపల్లె, చీరాల మీదుగా ఒంగోలు వెళ్లేలా చర్యలు చేపట్టారు. 

విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ వెళ్లే వాహనాలు హనుమాన్‌జంక్షన్‌ నుంచి నూజివీడు మీదుగా ఇబ్రహీంపట్నం వైపు మళ్లిస్తారు. హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలు ఇబ్రహీంపట్నం వద్ద దారి మళ్లించుకుని హనుమాన్‌ జంక్షన్‌ వైపు వెళ్లాలని సూచించారు. చెన్నై వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే భారీ వాహనాలు చిలకలూరిపేట, ఒంగోలు వద్ద జాతీయ రహదారిపై నిలిపివేస్తారు. విశాఖపట్నం వైపు నుంచి చెన్నై వైపు వెళ్లే భారీ వాహనాలు హనుమాన్ జంక్షన్‌, పొట్టిపాడు టోల్‌గేట్‌ వద్ద ఆపేస్తారు. రాత్రి 10గంటల తర్వాతే భారీ వాహనాలను జాతీయ రహదారిపైకి అనుమతిస్తారు. ప్లీనరీకి వచ్చే వాహనాల పార్కింగ్‌ కోసం ఏర్పాట్లు చేశారు. విజయవాడ నుంచి ప్లీనరీకి వచ్చే బస్సులు కాజ టోల్‌ప్లాజా వద్ద రామకృష్ణ వెనూజియాలో, కార్లు, ద్విచక్రవాహనాలకు నాగార్జున యూనివర్సిటీలో పార్కింగ్‌ వసతి కేటాయించారు. గంటూరు నుంచి వచ్చే బస్సుల్ని నంబూరు, కంతెరు రోడ్డుపైన, కార్లు, ద్విచక్ర వాహనాలకు కేశవరెడ్డి స్కూల్, అమలోద్భవి హోటల్, రైన్ ట్రీ అపార్ట్మెంట్స్ పక్కన పార్కింగ్ కేటాయిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని