Andhra News: ఒంటిమిట్టలో రాములోరి కల్యాణోత్సవం.. పోలీసుల ట్రాఫిక్‌ ఆంక్షలు

వైఎస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరాముని కల్యాణోత్సవ వేడుకలకు తితిదే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

Updated : 15 Apr 2022 15:17 IST

ఒంటిమిట్ట: వైఎస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరాముని కల్యాణోత్సవ వేడుకలకు తితిదే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈరోజు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు పండు వెన్నెల్లో శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. సుమారు 52 వేల మంది భక్తులు కూర్చొని వీక్షించే విధంగా శాశ్వత కల్యాణ వేదికలో ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలకు సీఎం జగన్‌ హాజరై రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

రాములోరి కల్యాణం సందర్భంగా ఆ ప్రాంతంలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేస్తున్నారు. కడప-రేణిగుంట వైపు వెళ్లే వాహనాలను దారిమళ్లిస్తున్నారు. రేపు ఉదయం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. కల్యాణోత్సవానికి హాజరయ్యే భక్తుల వాహనాల పార్కింగ్‌ కోసం 15 చోట్ల ఏర్పాట్లు చేశారు. ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కడప, ఒంటిమిట్ట ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని