Telangana News: తెలంగాణలో 15 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ

తెలంగాణలో 15 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated : 31 Jan 2023 20:30 IST

హైదరాబాద్‌: తెలంగాణలో 15 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా శిశుసంక్షేమశాఖ కమిషనర్‌గా భారతి హోళికేరి, నిజామాబాద్‌ కలెక్టర్‌గా రాజీవ్‌ గాంధీ హనుమంతు, హనుమకొండ జిల్లా కలెక్టర్‌గా సిక్తా పట్నాయక్‌, ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా రాహుల్‌ రాజ్‌, వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా నారాయణరెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్‌గా అమోయ్‌ కుమార్‌ (హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా అమోయ్‌ కుమార్‌కు అదనపు బాధ్యతలు), కుమురంభీం ఆసిఫాబాద్‌ కలెక్టర్‌గా యాస్మిన్‌ బాషా, మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌గా జి.రవి, సూర్యాపేట జిల్లా కలెక్టర్‌గా ఎస్‌.వెంకటరావు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఎస్‌.హరీశ్‌, కరీంనగర్‌ కలెక్టర్‌గా ఆర్‌.వి.కర్ణన్‌ ( జగిత్యాల జిల్లా అదనపు బాధ్యతలు), వనపర్తి జిల్లా కలెక్గర్‌గా తేజస్‌ నందలాల్‌, నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌గా కర్నాటి వరుణ్‌రెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా రాహుల్‌ రాజ్‌ ను నియమిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు