Andhra news: ఏపీలో ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌ల బదిలీ

ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

Updated : 20 Jun 2024 22:16 IST

 

అమరావతి: ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ ఇన్‌ఛార్జి డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ కమిషనర్‌గా నియమించింది. అతుల్‌ సింగ్‌కు ఏసీబీ డీజీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. సాధారణ పరిపాలనశాఖకు రిపోర్టు చేయాలని పీవీ సునీల్‌కుమార్‌కు ఆదేశాలిచ్చింది. శంకబ్రత బాగ్చీకి అగ్నిమాపకశాఖ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. రిశాంత్‌రెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం ఆయన కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌ ఎస్పీగా ఉన్నారు. ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్‌ బాధ్యతల నుంచీ రిశాంత్‌ను రిలీవ్‌ చేసింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు