Updated : 10 Nov 2021 05:29 IST

Padma Shri: వినూత్న రీతిలో పద్మశ్రీని స్వీకరించిన ట్రాన్స్‌జెండర్‌

దిల్లీ: తాను చేసిన సాంస్కృతిక సేవలకు గాను కర్ణాటకకు చెందిన ప్రముఖ జానపద కళాకారిణి, ట్రాన్స్‌జెండర్‌ మంజమ్మ జోగటి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమెకు పురస్కారాన్ని బహూకరించారు. అయితే తన పేరును పిలవగానే వినమ్రంగా సభకు, రాష్ట్రపతికి నమస్కరిస్తూ వెళ్లిన మంజమ్మ.. వేదికకు మొక్కి రాష్ట్రపతికి తన చీర కొంగుతో పలుమార్లు దిష్టి తీశారు. దీంతో సభా ప్రాంగణం కరతాళ ధ్వనులతో మార్మోగింది. ఆమె చర్యతో రాష్ట్రపతి సైతం మురిసిపోయినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను భాజపా యువమోర్చా జాతీయాధ్యక్షుడు తేజస్వి సూర్య సహా పలువురు ప్రముఖులు ట్విటర్‌ వేదికగా పంచుకుంటూ పద్మశ్రీని అందుకున్న మంజమ్మకు అభినందనలు తెలిపారు.


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని