Black Circles: కళ్ల కింద నల్లని వలయాలున్నాయా..? ఎందుకు వస్తాయో తెలుసుకోండి..

నిద్ర సరిగా పోకపోయినా, మానసిక ఒత్తిడి అధికంగా ఉన్నా కళ్ల కింద నల్లని వలయాలు ఏర్పడుతాయి. వాటిని చూడగానే మానసిక సంఘర్షణకు లోనైనట్టు తెలిసిపోతుంది. ఆ నల్లని వలయాలను తగ్గించుకోవడానికి రకరకాల మందులను చాలా మంది వాడుతుంటారు. కొంతమంది చర్మవ్యాధి నిపుణులను కలుసుకుంటారు.

Updated : 25 Sep 2022 15:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నిద్ర సరిగా లేకపోయినా, మానసిక ఒత్తిడి అధికంగా ఉన్నా కళ్ల కింద నల్లని వలయాలు ఏర్పడతాయి. వాటిని చూడగానే మానసిక సంఘర్షణకు లోనైనట్లు తెలిసిపోతుంది. ఆ నల్లని వలయాలను తగ్గించుకోవడానికి రకరకాల మందులు వాడుతుంటారు. కొంతమంది చర్మవ్యాధి నిపుణులను కలుస్తారు. వాస్తవానికి ఈ సమస్య ఇన్‌ఫెక్షన్లు, కంట్లో రక్తకణాలు దెబ్బతినడంతో పాటు వంశపారంపర్యంగా వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ వలయాలు ఎందుకొస్తాయి..? వాటికి ఏ పరిష్కార మార్గాలున్నాయో ప్రముఖ డెర్మటాలజిస్టు డాక్టర్‌ సందీప్‌ వివరించారు.

నలుపు సమస్యకు కారణాలెన్నో..

కళ్ల కింద నలుపు రావడానికి చాలా కారణాలుంటాయి. కళ్లద్దాలు వాడటం, అధిక పని ఒత్తిడి, మానసిక ఆందోళన, రక్తహీనత, హార్మోన్ల సమస్య, అధిక బరువు, పీసీవోడీలతో వస్తుంది. ఇది వ్యాధి కాదు. లక్షణం మాత్రమే. హిమోగ్లోబిన్‌ పెంచే ఆహారం తీసుకోవడంతో పాటు కంటికి విశ్రాంతి ఇస్తే చాలా వరకూ తగ్గిపోతుంది. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు ఎక్కువ సేపు చూడటం కూడా మంచిది కాదు. కాస్మోటిక్స్‌ వాడటంతో కూడా నల్లని వలయాలు వస్తాయి.

ఏం చేస్తే పోతుందంటే..

ముందుగా జీవనశైలి మార్చుకోవాలి. వీటికి ఇచ్చే మందులు 40 శాతం మాత్రమే పని చేస్తాయి. హిమోగ్లోబిన్‌ పెంచుకోవాలి. నిద్ర సరిపోయినంత ఉన్నప్పుడు నలుపు తగ్గిపోతుంది. విటమిన్‌ సి ఎక్కువగా తీసుకోవాలి. కంటికింద కొబ్బరి నూనె రాసుకొని నిద్రపోవాలి. గులాబీ రేకులను మెత్తగా నలిపి కళ్ల కింద రాసుకోవచ్చు. పుచ్చకాయల గుజ్జు బాగానే పని చేస్తుంది.. ఆలుగడ్డ, కీరాలను చక్రాలుగా కోసి కళ్లపైన పెట్టుకోవాలి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని