Hearing: ఏవండీ.. వినిపించడం లేదా...? ఎందుకో తెలుసా..!

వినిపించకపోతే ఎన్నో అనర్థాలు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు ముఖ్యమైన విషయాలను తెలుసుకోలేకపోతాం..కొన్నిసార్లు  ఎదుటి వారికి ఇబ్బందులను కూడా తెస్తుంది. అదే చిన్నారులకయితే మాటలు రాకుండా పోతాయని వైద్యులు చెబుతున్నారు.

Published : 23 Oct 2022 01:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వినిపించకపోతే ఎన్నో అనర్థాలు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు ముఖ్యమైన విషయాలను తెలుసుకోలేకపోతాం.. కొన్నిసార్లు ఎదుటి వారికి ఇబ్బందులను కూడా తెస్తుంది. అదే చిన్నారులకైతే మాటలు రాకుండా పోతాయని వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్య చిన్నతనం నుంచి ఉన్నా, మధ్యలో అకస్మాత్తుగా వచ్చినా వెంటనే వైద్యులను కలుసుకోవాలని ఈఎన్‌టీ సర్జన్‌ డాక్టర్‌ జయకృష్ణ తెలిపారు. 

ఎందుకిలా అవుతుందంటే...

చెవి నుంచి మెదడు మధ్యలో ఏదైనా సమస్య ఏర్పడితే వినిపించకుండా పోతుంది. చెవిలో రంధ్రం పడినప్పుడు, కాక్లియార్‌లోని ఎయిర్‌సెల్స్‌లో ఇబ్బందులున్నా వినికిడి తగ్గిపోతుంది. నరాల బలహీనతతో కూడా ఈ సమస్య ఉత్పన్నం అవుతుంది. ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌, కర్ణభేరిలో రంధ్రం ఏర్పడినప్పుడు శబ్ధం వినిపించదు. 

ఎలా చేస్తారంటే...

చెవిలో సమస్యలున్నట్లయితే కొన్నిసార్లు మందులతో తగ్గిపోతుంది. లోపలి చెవిలో ఇబ్బందులుంటే ఆపరేషన్‌ చేయక తప్పదు. కాక్లియర్‌ ఇంప్లాంట్లు, హియరింగ్‌ ఎయిడ్స్‌తో వినికిడి తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ఎండోస్కోపీతో ఎలాంటి చికిత్సయినా చేయగలుగుతున్నాం. చెవిని పొడిగా ఉంచుకోవడం తప్పనిసరి. పుల్లలను పెట్టుకోవద్దు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని