Menstrual Disturbances: నెలసరి చిక్కులెందుకో..? కారణాలు ఇవే..!

రుతుచక్రం మొదలైన రోజుల్లో గాడి తప్పడం మామూలే..వయసుతో పాటు అది సర్దుకుంటుందని వైద్యులు చెబుతున్నారు. కొంతమంది మహిళలకు నెలసరి తప్పటడుగులు వేస్తుంది. రెండు, మూడు నెలలైనా ఊసే ఉండదు. కొందరికి ఎక్కువ రోజులుండటం, మరికొందరికీ ఏదో వచ్చిపోయినట్టు ఉంటుంది. నెలసరి సమయంలో పొత్తి కడుపులో నొప్పితో విలవిలలాడేవారు ఎక్కువగానే ఉంటారు.

Published : 11 Aug 2022 01:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రుతుచక్రం మొదలైన రోజుల్లో గాడి తప్పడం మామూలే..వయసుతో పాటు అది సర్దుకుంటుందని వైద్యులు చెబుతున్నారు. కొంతమంది మహిళలకు నెలసరి తప్పటడుగులు వేస్తుంది. రెండు, మూడు నెలలైనా ఊసే ఉండదు. కొందరికి ఎక్కువ రోజులుండటం, మరికొందరికీ ఏదో వచ్చిపోయినట్టు ఉంటుంది. నెలసరి సమయంలో పొత్తి కడుపులో నొప్పితో విలవిలలాడేవారు ఎక్కువగానే ఉంటారు. ఇలాంటి చిక్కులకు ఎక్కువగా హార్మోన్ల సమతుల్యం లోపించడంతో పాటు జీవనశైలి, ఊబకాయం కారణమని గైనకాలజిస్టు డాక్టర్‌ పావని మాణిక్య తెలిపారు. 

ఇబ్బందులు ఇవీ: బ్లీడింగ్‌ తక్కువగా కావడం, నెలసరి ఆలస్యం, ఎక్కువగా బ్లీడింగ్‌ అవుతుండటం, కొన్నిసార్లు ముద్దలుగా పడిపోతుంది. పిరియడ్‌ సమయంలో నొప్పి అధికంగా ఉంటుంది. 

కారణాలు ఇలా..: చాలా కారణాలకు థైరాయిడ్‌ సమస్య ప్రధానంగా ఉంటుంది. ప్రొలాక్టిన్‌ హార్మోన్‌ విడుదలతో గర్భం దాల్చిన తర్వాత పాలు పడుతాయి. గర్భం రాకపోయినా పాలు వస్తే పిరియడ్స్‌ ఆలస్యం అవుతాయి. పీసీఓతో కూడా ఆలస్యం అవుతుంది. రక్తస్రావం అధికంగా వస్తే ఎండోమెట్రిమ్‌, పైబ్రాయిడ్స్‌ కారణమవుతాయి. గర్భనిరోధక మాత్రలు వాడినా కొంత గందరగోళంగా ఉంటుంది.

చికిత్స ఎలా..: చాలా వరకు హార్మోన్‌ మందులు వాడితే ఇబ్బందులు పోతాయి. అన్ని సమయాల్లో మందులు వాడాల్సిన అవసరం లేదు. వయసు పెరిగిన తర్వాత నెలసరి ముందు, వెనకా వస్తుంది. దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గర్భం కావాలనుకున్నపుడు వైద్యుల సలహాతోనే జాగ్రత్తలు తీసుకోవాలి. బరువు పెరగకుండా వ్యాయామం చేయాలి. ఆహారంలో మార్పులు చేసుకోవడంతో చాలా వరకు సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని