Health: కంటిచూపు దొంగ ‘గ్లకోమా’

కంటి జబ్బుల్లో ప్రమాదకరమైనది గ్లకోమా..దీని లక్షణాలు బయటకు కనిపించవు. చాలా మందికి ఇది ముదిరిపోయిన తర్వాతే బయట పడుతుంది

Published : 29 May 2022 01:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కంటి జబ్బుల్లో ప్రమాదకరమైనది గ్లకోమా..దీని లక్షణాలు బయటకు కనిపించవు. చాలా మందికి ఇది ముదిరిపోయిన తర్వాతే బయట పడుతుంది. అప్పటికే చూపు చాలా తగ్గిపోతుంది. నిశ్శబ్దంగా కంటిచూపును కబళించి శాశ్వత అంథత్వాన్ని తెచ్చే గ్లకోమా తీరుతెన్నులను కంటి వైద్యులు రవికుమార్‌రెడ్డి వివరించారు.

ఒత్తిడితోనే సమస్య: ఒత్తిడి ఎంత ఉంటే అవయవాలు అంతగా దెబ్బతింటాయి. కంట్లో కనిపించే గ్లకోమా అలాంటిదే. గ్లకోమా మొదలయినపుడు ఒంట్లో ఒత్తిడి పెరుగుతుంది. దీంతో కంటినిండా నీటి కాసులు పుట్టుకొస్తాయి. 

ఎలా తెలుస్తుంది: దాదాపుగా 90శాతం మందికి గ్లకోమా వచ్చిన విషయం కూడా తెలియదు. కంటి పరిశోధన చేసినపుడు బయట పడుతుంది వయస్సు ఆధారంగా, వంశపరంపార్యంగా రావొచ్చు. హై మయోపతి ద్వారా కూడా వస్తుంది.  పక్కచూపు తగ్గిపోతుంది. కన్ను తరచుగా ఎరుపుగా మారుతుంది. అప్పుడప్పుడు కంట్లో నొప్పిగా అనిపిస్తుంది. 

చికిత్స ఇదే: ఓపెన్‌ యాంగిల్‌ గ్లకోమాకు డ్రాప్స్‌ ఇస్తాం. ఇది చాలా బాగా పని చేస్తున్నాయి. ఇది జీవితాంతం వాడాలి. ఈ మందు పని చేయని వారికి ఆపరేషన్‌ చేస్తాం. క్లోజ్డ్‌ యాంగిల్‌ గ్లకోమాకు చిన్న లేజర్‌ చికిత్స ఉంటుంది. చిన్న పిల్లల్లో గ్లకోమా వస్తే ఆపరేషన్‌ తప్పనిసరిగా చేయాల్సిందే. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని