
Published : 29 Jan 2022 13:16 IST
CM KCR: సీఎం కేసీఆర్ అధ్యక్షతన రేపు తెరాస పార్లమెంటరీ పార్టీ భేటీ
హైదరాబాద్: తెరాస అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన రేపు మధ్యాహ్నం ప్రగతిభవన్లో తెరాస పార్లమెంటరీ పార్టీ భేటీ కానుంది. పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా ఎంపీలతో కేసీఆర్ భేటీ కానున్నారు. ఈ భేటీలో లోక్సభ, రాజ్యసభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన, కేంద్రం నుంచి సాధించాల్సిన పలు అంశాలపై ఎంపీలకు నివేదికలు అందజేయనున్నారు. కేంద్రంపై అనుసరించాల్సిన పోరాట పంథాపై కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.
Tags :