Telangana News: పంచాయతీ కార్యదర్శిపై తెరాస సర్పంచ్‌, ఎంపీటీసీ భర్త దాడి

నల్గొండ జిల్లా చండూరు మండలంలో తెరాసకు చెందిన సర్పంచ్‌, ఎంపీటీసీ భర్త రెచ్చిపోయారు. పార్టీ దిమ్మె ఏర్పాటుకు అనుమతి ఇవ్వకపోవడంతో మండల పరిషత్‌ కార్యాలయం వద్ద పంచాయతీ కార్యదర్శిపై కర్రలతో దాడి చేశారు.

Updated : 26 Apr 2022 16:02 IST

చండూరు: నల్గొండ జిల్లా చండూరు మండలంలో తెరాసకు చెందిన సర్పంచ్‌, ఎంపీటీసీ భర్త రెచ్చిపోయారు. పార్టీ దిమ్మె ఏర్పాటుకు అనుమతి ఇవ్వకపోవడంతో మండల పరిషత్‌ కార్యాలయం వద్ద పంచాయతీ కార్యదర్శిపై కర్రలతో దాడి చేశారు. వివరాల్లోకి వెళితే చండూరు మండలం చామనపల్లి గ్రామంలో తెరాస జెండా దిమ్మె నిర్మాణానికి అనుమతి ఇవ్వాలంటూ కొన్ని రోజులుగా పంచాయతీ కార్యదర్శి లక్ష్మారెడ్డిపై సర్పంచ్‌, ఎంపీటీసీ భర్త ఒత్తిడి తెస్తున్నారు. ఏకపక్షంగా అనుమతి ఇవ్వడం కుదరదని.. పాలకవర్గం తీర్మానం తర్వాతే ఇస్తానని లక్ష్మారెడ్డి చెప్పారు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన సర్పంచ్‌ ఎర్రయ్య, ఎంపీటీసీ భర్త వెంకటయ్య విచక్షణారహితంగా కర్రలతో దాడి చేశారు. రక్తమోడేలా తీవ్రంగా గాయపడటంతో కార్యదర్శి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

మరోవైపు ఈ ఘటనపై ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. సర్పంచ్‌ను పదవి నుంచి తొలగించాలని.. సర్పంచ్‌, ఎంపీటీసీ భర్తపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని