
ఒడిశాలో మంటల్లో చిక్కుకున్న లారీ
భద్రక్: ఒడిశాలోని భద్రక్ జిల్లాలో ఓ లారీ మంటల్లో చిక్కుకుంది. హైదరాబాద్ నుంచి కోల్కతా వెళ్తున్న లారీలో జాతీయ రహదారి 16పై సహపూర్ వద్ద మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. ప్రమాద కారణాలు తెలియరాలేదు. రహదారిపై లారీ వెళ్తున్న సమయంలో పెద్ద శబ్దం వచ్చిందని, తరువాత లారీ మంటల్లో చిక్కుకుందని స్థానికులు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.