TS Cabinet: మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లకు తెలంగాణ కేబినెట్‌ ఆమోదం

మద్యం దుకాణాల్లో వివిధ వర్గాలకు రిజర్వేషన్లకు అవకాశం కల్పిస్తూ తెలంగాణ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశమైన

Updated : 16 Sep 2021 22:20 IST

హైదరాబాద్‌: మద్యం దుకాణాల్లో వివిధ వర్గాలకు రిజర్వేషన్లకు అవకాశం కల్పిస్తూ తెలంగాణ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశమైన మంత్రి వర్గం రిజర్వేషన్ల అంశంపై కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్‌ గతంలో ఇచ్చిన హామీ మేరకు గౌడ కులస్థులకు 15శాతం, ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది.

మరిన్ని కేబినెట్‌ నిర్ణయాలు..

* ధరణి పోర్టల్‌లో తలెత్తుతున్న సమస్యల పరిష్కారం కోసం ఉపసంఘం ఏర్పాటు. మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, సబిత ఇంద్రారెడ్డి సభ్యులుగా ఉంటారు.

* రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పాడైపోయిన రోడ్ల మరమ్మతులకు అదనంగా నిధుల కేటాయింపు.

* సంగారెడ్డి, ఆందోల్, జహీరాబాద్, నారాయణ్ ఖేడ్ నియోజకవర్గాల్లో 3.84 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు ఆమోదం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని