TS News: తెలంగాణలో కొవిడ్‌ పరిస్థితులపై చర్చించిన కేబినెట్‌

రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితులు, వ్యాప్తి నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గం చర్చిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో కేబినెట్‌ సమావేశమైంది

Published : 17 Jan 2022 15:54 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితులు, వ్యాప్తి నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గం చర్చిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో కేబినెట్‌ సమావేశమైంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సమావేశంలో చర్చిస్తున్నారు. కరోనా పరిస్థితులు, వైద్యారోగ్యశాఖ సన్నద్ధతను మంత్రి హరీశ్‌రావు గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి అదుపులోనే ఉందని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా వైద్యారోగ్యశాఖ సిద్ధంగా ఉందని తెలిపారు. వైరస్‌ వ్యాప్తి నివారణకోసం తీసుకోవాల్సిన ముందుజాగ్రత్త చర్యలు, మరిన్ని ఆంక్షల విషయమై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 30వ తేదీ వరకుసెలవులు పొడిగించిన నేపథ్యంలో విద్యాబోధన విషయమై కూడా మంత్రివర్గంలో చర్చించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని