Updated : 12 Apr 2021 09:35 IST

టీఎస్‌ కరోనా : 2251 కేసులు.. 6 మరణాలు

హైదరాబాద్‌ :  తెలంగాణలో కరోనా రెండో దశ ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 79,027 పరీక్షలు నిర్వహించగా.. 2251 కొవిడ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 3,29,529కి చేరింది. మరోవైపు కొవిడ్‌తో చికిత్స పొందుతూ ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 1765కి చేరింది. నిన్న కరోనా నుంచి 565 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3,05,900కి చేరింది. తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 355 కేసులు నమోదయ్యాయి.
 

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని