Corona Update: తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు

తెలంగాణ  కరోనా కేసులు భారీగా పెరిగాయి. రాష్ట్రంలో ఈరోజు 26,704 మంది నమూనాలు పరీక్షించగా... కొత్తగా 403 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ బారి నుంచి

Updated : 21 Jun 2022 21:05 IST

హైదరాబాద్‌: తెలంగాణ  కరోనా కేసులు భారీగా పెరిగాయి. రాష్ట్రంలో ఈరోజు 26,704 మంది నమూనాలు పరీక్షించగా... కొత్తగా 403 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ బారి నుంచి ఇవాళ 145 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,375కి చేరిందని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. గత వారంతో పోలిస్తే ఇవాళ రెట్టింపు కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. మరో వైపు దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా 12 వేలకుపైగానే నమోదైన కొత్త కేసులు ఇవాళ 10వేల దిగువకు చేరాయి.. పలు రాష్ట్రాల్లో వైరస్‌ విస్తరిస్తుండటంతో క్రియాశీల కేసులు 79 వేలపైకి ఎగబాకాయని మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

రాష్ట్రంలో రోజురోజుకీ కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ ప్రజలకు పలు సూచనలు చేసింది.

* ప్రజలు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలి.

* జనసమ్మర్థ ప్రాంతాల్లో మాస్క్, భౌతికదూరం తప్పనిసరి.

* దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధులు అత్యవసరమైతేనే బయటకు రావాలి.

* జలుబు, జ్వరం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని