TS EAMCET 2023: తెలంగాణ ఎంసెట్‌, పీజీ ఈసెట్‌ షెడ్యూల్‌ విడుదల

తెలంగాణ ఎంసెట్‌, పీజీ ఈసెట్‌ షెడ్యూల్‌ విడుదలైంది. షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి విడుదల చేశారు.

Updated : 24 Feb 2023 13:05 IST

హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌ షెడ్యూల్‌ విడుదలైంది. ఈనెల 28న నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి వెల్లడించారు. మార్చి 3 నుంచి ఏప్రిల్‌ 4 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుముతో మే 2 వరకు ఎంసెట్‌ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్‌ 30 నుంచి ఎంసెట్‌ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని.. మే 7 నుంచి 11 వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి పేర్కొంది.

పీజీ ఈసెట్‌కు ఇలా..

పీజీ ఈసెట్‌ షెడ్యూల్‌నూ అధికారులు విడుదల చేశారు. ఈ నెల 28న పీజీ ఈసెట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చి మార్చి 3 నుంచి ఏప్రిల్‌ 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుంతో మే 24 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు. మే 21 నుంచి పీజీ ఈసెట్‌ హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.  మే 29 నుంచి జూన్‌ 1 వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు.

పీజీ ఈసెట్‌ ముఖ్యమైన తేదీలివే..

*నోటిఫికేషన్ తేదీ : 28-02-2023

*ఆన్‌లైన్‌ అప్లికేషన్స్ స్వీకరణ తేదీ : 03-03-2023

*ఆన్‌లైన్‌ అప్లికేషన్స్ స్వీకరణ చివరి తేదీ : 30-04-2023

*ఆన్‌లైన్‌ అప్లికేషన్స్‌లో మార్పులు చేసుకునే తేదీలు : 02-05-2023 నుంచి 04-05-2023 వరకు

*250 రూపాయల అపరాధ రుసుముతో ఆన్‌లైన్‌ అప్లికేషన్ చివరి తేదీ : 05-05-2023

*500 రూపాయల అపరాధ రుసుముతో ఆన్‌లైన్‌ అప్లికేషన్ చివరి తేదీ : 10-05-2023

* 2500 రూపాయల అపరాధ రుసుముతో ఆన్‌లైన్‌ అప్లికేషన్ చివరి తేదీ : 15-05-2023

* 5000 రూపాయల అపరాధ రుసుముతో ఆన్‌లైన్‌ అప్లికేషన్ చివరి తేదీ : 24-05-2023

* 21-05-2023 తేదీ నుంచి అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

* పరీక్షా తేదీలు : 29-05-2023 నుంచి 01-06-2023 వరకు..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని