TS EAMCET: తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. దీంతో ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను కూడా ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. 3 విడతల్లో ఎంసెట్‌ ప్రవేశాల ప్రక్రియ చేపట్టనున్నట్టు తెలిపింది...

Updated : 12 Aug 2022 18:39 IST

హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. దీంతో ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను కూడా ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. 3 విడతల్లో ఎంసెట్‌ ప్రవేశాల ప్రక్రియ చేపట్టనున్నట్టు తెలిపింది.

కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఇదే..

* ఈనెల 21 నుంచి 29 వరకు ఆన్‌లైన్‌ స్లాట్ బుకింగ్

* ఈనెల 23 నుంచి 30 వరకు ధ్రువపత్రాల పరిశీలన

* ఈనెల 23 నుంచి సెప్టెంబరు 2 వరకు వెబ్ ఆప్షన్లు

* సెప్టెంబరు 6న ఇంజినీరింగ్ మొదటి విడత సీట్ల కేటాయింపు

* సెప్టెంబరు 28 నుంచి రెండో విడత ఎంసెట్ కౌన్సెలింగ్

* సెప్టెంబరు 28, 29న రెండో విడత స్లాట్ బుకింగ్

* సెప్టెంబరు 30న రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన

* సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 1 వరకు వెబ్ ఆప్షన్లు

* అక్టోబరు 4న రెండో విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు

* అక్టోబరు 11 నుంచి తుది విడత కౌన్సెలింగ్

* అక్టోబరు 13న తుది విడత ధ్రువపత్రాల పరిశీలన

* అక్టోబరు 11 నుంచి 14 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు

* అక్టోబరు 17న తుది విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు

* అక్టోబరు 20న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు జారీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని