పుదుచ్చేరి ఎల్జీగా తమిళిసై బాధ్యతల స్వీకరణ

పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా తమిళిసై గురువారం ఉదయం అదనపు బాధ్యతలు చేపట్టారు.

Updated : 18 Feb 2021 10:41 IST

పుదుచ్చేరి: పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా తమిళిసై గురువారం ఉదయం అదనపు బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్‌గా ఉన్న ఆమె పుదుచ్చేరి ఎల్జీగా అదనపు బాధ్యతలు స్వీకరించారు. అక్కడి రాజ్‌భవన్‌లో తమిళిసై చేత మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఆ ప్రాంత ముఖ్యమంత్రి నారాయణస్వామి పాల్గొన్నారు. ఎల్జీగా బాధ్యతలు చేపట్టడానికి నిన్న రాత్రి పుదుచ్చేరి చేరుకున్న తెలంగాణ గవర్నర్‌ తమిళిసైకి సీఎం నారాయణస్వామి స్వాగతం పలికారు. 

పుదుచ్చేరిలో నెలరోజుల వ్యవధిలో అధికార కాంగ్రెస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో అక్కడి ప్రభుత్వం సంక్షోభంలో పడింది. దీంతో అక్కడి రాజకీయాలు అనూహ్య మలుపులు తిరిగాయి. ఈ క్రమంలో పుదుచ్చేరికి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఉన్న కిరణ్‌బేదీని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ నెల 16న తొలగించిన విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని