Telangana Jobs: గుడ్‌ న్యూస్‌.. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,540 పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌!

Telangana jobs: జీహెచ్‌ఎంసీ పరిధిలో 1540 ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

Published : 22 Mar 2023 02:21 IST

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ(GHMC) పరిధిలో నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లో 1,540 ఆశావర్కర్ల భర్తీకి పచ్చజెండా ఊపింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ట్విటర్‌లో షేర్‌ చేస్తూ సీఎం కేసీఆర్‌ సారథ్యంలో  రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ బలోపేతానికి మరో అడుగు పడినందుకు హర్షం ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,540 మంది ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందని పేర్కొన్నారు. రిజ్వీ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం..  హైదరాబాద్‌లో 323 పోస్టులను భర్తీ చేయనుండగా.. మేడ్చల్‌ జిల్లాలో 974, రంగారెడ్డి జిల్లాలో 243 మంది ఆశావర్కర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ భర్తీ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిల్లా నియామక కమిటీల ద్వారా భర్తీ చేస్తారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని