TS: బ్లాక్‌ఫంగస్‌ కేసుల చికిత్సకు నోడల్‌ కేంద్రం

తెలంగాణలో బ్లాక్‌ ఫంగస్‌ కేసుల చికిత్సకు రాష్ట్ర ప్రభుత్వం నోడల్‌ కేంద్రం ఏర్పాటు చేసింది. కోఠిలోని ఈఎన్‌టీ ఆస్పత్రిని నోడల్‌ కేంద్రంగా ప్రకటించిందితెలంగాణలో బ్లాక్‌ ఫంగస్‌ కేసుల చికిత్సకు రాష్ట్ర ప్రభుత్వం నోడల్‌ కేంద్రం ఏర్పాటు చేసింది. కోఠిలోని ఈఎన్‌టీ ఆస్పత్రిని నోడల్‌ కేంద్రంగా ప్రకటించింది

Updated : 22 Aug 2022 15:00 IST

హైదరాబాద్‌: తెలంగాణలో బ్లాక్‌ ఫంగస్‌ కేసుల చికిత్సకు రాష్ట్ర ప్రభుత్వం నోడల్‌ కేంద్రం ఏర్పాటు చేసింది. కోఠిలోని ఈఎన్‌టీ ఆస్పత్రిని నోడల్‌ కేంద్రంగా ప్రకటించింది. కొవిడ్‌ నుంచి కోలుకున్న వారిలో కొందరికే బ్లాక్‌ ఫంగస్‌ సమస్య వస్తోందని డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ వెల్లడించింది. బ్లాక్‌ ఫంగస్‌ నిర్ధారణ అయిన కరోనా బాధితులకు గాంధీలో చికిత్స అందించనున్నట్టు తెలిపింది. బ్లాక్‌ ఫంగస్‌ బాధితులకు మాత్రం పూర్తిగా కోఠిలోని ఈఎన్‌టీలోనే చికిత్స అందిస్తామని స్పష్టంచేసింది. బ్లాక్‌ ఫంగస్‌కు వాడే ఔషధాలు సమకూర్చాలని ఈ మేరకు టీఎస్‌ఎంఐడీసీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.  

కొవిడ్‌ రోగులకు చికిత్స అందించే సమయంలో షుగర్‌ స్థాయిని సరిగా అదుపుచేయాలని డీఎంఈ సూచించింది. కరోనాతో చికిత్సపొందుతున్న సమయంలో బ్లాక్‌ ఫంగస్‌ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రైవేటు ఆస్పత్రులకు ఆదేశాలు జారీచేసింది. షుగర్‌ స్థాయిలను నియంత్రించేందుకు అవసరమైతేనే స్టిరాయిడ్లు వాడాలంది. బ్లాక్‌ ఫంగస్‌ బారినపడుతున్నవారిలో ఎక్కువగా ఈఎన్‌టీ సమస్యలు వస్తున్నాయని.. దీని బారిన పడి కంటి వైద్యుడి అవసరం ఉంటే గనక అలాంటి రోగుల కోసం సరోజినీదేవి కంటి ఆస్పత్రి సేవలు వినియోగించుకోవాలని సూచించింది. గాంధీ ఆస్పత్రి, సరోజినీదేవి ఆస్పత్రి, ఈఎన్‌టీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌లు పరస్పరం సమన్వయంతో తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని