Updated : 09 Jun 2021 18:30 IST

తెలంగాణలో ద్వితీయ ఇంటర్‌ పరీక్షలు రద్దు 

హైదరాబాద్‌: తెలంగాణలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే ప్రథమ సంవత్సరం పరీక్షలను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా ద్వితీయ సంవత్సరం పరీక్షలను కూడా రద్దు  చేసింది.  ఇంటర్‌ పరీక్షలపై మంగళవారం కేబినెట్‌ భేటీలో చర్చ జరిగింది. కేబినెట్‌ భేటీ తర్వాత దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. బుధవారం సాయంత్రం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారికంగా ప్రకటించారు.

ప్రథమ సంవత్సరం మార్కుల ఆధారంగా ఫలితాలు ప్రకటిస్తామని మంత్రి తెలిపారు. మార్కుల కేటాయింపుపై త్వరలో కమిటీ ఏర్పాటు చేసి విధివిధానాలు రూపొందిస్తామన్నారు. కమిటీ నిర్ణయం ఆధారంగా ఫలితాలు వెల్లడిస్తామన్నారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి వెల్లడించారు. పరీక్షలు రాయాలనుకునే వారు పరిస్థితులు చక్కబడ్డాక రాయొచ్చని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని