TS: స్కూలు ఫీజులు పెంచితే గుర్తింపు రద్దు!

తెలంగాణలోని ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులపై రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీచేసింది. ఈ విద్యా సంవత్సరం ప్రైవేటు పాఠశాలలు....

Updated : 06 Jul 2021 17:50 IST

జీవో జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్‌: తెలంగాణలోని ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులపై రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీచేసింది. ఈ విద్యా సంవత్సరం ప్రైవేటు పాఠశాలలు ఫీజులు పెంచొద్దని ఆదేశించింది. బోధనా రుసుము మాత్రమే నెల వారీగా తీసుకోవాలని తేల్చి చెప్పింది. రాష్ట్ర, సీబీఎస్‌ఈ, ఇతర బోర్డు పాఠశాలలకు ఈ ఆదేశాలను వర్తింపజేస్తున్నట్టు వెల్లడించింది. జీవోను ఉల్లంఘిస్తే గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించింది.

మరోవైపు, తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న సెట్‌ పరీక్షల్లో ఎలాంటి మార్పులు లేవని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు జులైలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ఆన్‌లోనే బోధించాలన్నారు. దూరదర్శన్‌ యాదగిరి, టీశాట్‌ ద్వారా తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. దూరదర్శన్‌ యూట్యూబ్‌ ఛానెల్‌లోనూ పాఠాలు అందుబాటులో ఉంటాయని వివరించారు. ప్రైవేటు పాఠశాలలు ట్యూషన్‌ ఫీజులు నెలవారీగా వసూలు చేయాలని ఆదేశించారు. కరోనా నేపథ్యంలో 50శాతం మంది ఉపాధ్యాయులు హాజరయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని