Telangana News: పదోతరగతి పరీక్షలపై కీలక నిర్ణయం.. ఇక నుంచి 6 పేపర్లే

తెలంగాణలో పదో తరగతి పరీక్షలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి 6 పేపర్లతో పదోతరగతి పరీక్షలు నిర్వహించాలన్న విద్యాశాఖ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Published : 14 Oct 2022 01:39 IST

హైదరాబాద్‌: తెలంగాణలో పదో తరగతి పరీక్షలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి 6 పేపర్లతో పదోతరగతి పరీక్షలు నిర్వహించాలన్న విద్యాశాఖ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు 11 పేపర్లతో పది పరీక్షలు జరుగుతున్నాయి. హిందీ మినహా మిగతా సబ్జెక్టులకు రెండు పేపర్లు చొప్పున పరీక్షలు ఉంటున్నాయి. గత రెండేళ్లుగా కొవిడ్‌ కారణంగా ఆరు పేపర్ల విధానాన్ని అమలు చేశారు. పదోతరగతి పరీక్ష విధానంపై సమీక్ష జరిపిన ఎన్సీఈఆర్టీ 11 రోజుల పాటు పరీక్షలు నిర్వహించడం వల్ల  విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోందని, వాటిని ఆరు పేపర్లకు కుదించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. పదో తరగతి విధి విధానాలను మారుస్తూ త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. నవంబర్‌ 1 నుంచి రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు ఎస్‌ఏ-1 పరీక్షలు జరగనున్నాయి. ఎస్‌ఏ-1 కూడా పదోతరగతికి 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్‌ రూపొందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని