జిల్లాల పేరు మార్చేందుకు నోటిఫికేషన్‌ వచ్చేసింది

వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ గ్రామీణ జిల్లాలను హన్మకొండ, వరంగల్‌ జిల్లాలుగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. మార్పుపై అభ్యంతరాలు, వినతులకు

Published : 12 Jul 2021 19:23 IST

హైదరాబాద్: వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ గ్రామీణ జిల్లాలను హన్మకొండ, వరంగల్‌ జిల్లాలుగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. మార్పుపై అభ్యంతరాలు, వినతులకు నెల గడువు విధించింది. హన్మకొండ, పరకాల రెవెన్యూ డివిజన్లతో కలిపి హన్మకొండ జిల్లా ఏర్పాటు చేస్తున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. మొత్తం 12 మండలాలు ఈ జిల్లా పరిధిలోకి రానున్నాయి. వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం కేంద్రంగా హన్మకొండ జిల్లా కేంద్రం కొనసాగుతుంది. ఇందులో హన్మకొండ, కాజీపేట, ఐనవోలు, ధర్మసాగర్‌, వేలేరు, వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి, హసన్‌పర్తి, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్‌ మండలాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. వరంగల్‌, ఖిలావరంగల్‌, సంగెం, గీసుకొండ, ఆత్మకూరు, దామెర, పరకాల, నడికూడ, శాయంపేట, నర్సంపేట, నెక్కొండ, చెన్నారావుపేట, నల్లబెల్లి, దుగ్గొండి, ఖానాపురం మండలాలు వరంగల్‌ జిల్లాలో ఉండే అవకాశం ఉంది. ఈ రెండు జిల్లాల పేర్లు మారుస్తున్నట్లు వరంగల్‌ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి జూన్‌ 21న శంకుస్థాపన సమయంలో సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts