లాయర్లను ప్రభుత్వమెందుకు ఆదుకోవాలి: హైకోర్టు

తెలంగాణలోని న్యాయవాదులు, క్లర్కులకు ప్రభుత్వం ఆర్థికసాయం చేయాలన్న పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. న్యాయవాది భాస్కర్‌ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన..

Updated : 07 Jul 2021 14:16 IST

హైదరాబాద్‌: తెలంగాణలోని న్యాయవాదులు, క్లర్కులకు ప్రభుత్వం ఆర్థికసాయం చేయాలన్న పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. న్యాయవాది భాస్కర్‌ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం.. న్యాయవాదులను ప్రభుత్వం ఎందుకు ఆదుకోవాలి?అని ప్రశ్నించింది. బార్‌కౌన్సిల్‌, న్యాయవాదుల సంఘాలదే ఈ బాధ్యత అని స్పష్టం చేసింది. న్యాయవాదులు ప్రభుత్వంపై ఆధారపడొద్దని.. సొంత నిధి ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. సీనియర్‌ లాయర్ల సహకారంతో నిధి ఏర్పాటు చేసుకోవాలని వివరించింది. వారం రోజుల్లో దీనికి సంబంధించిన వివరాలు సమర్పించాలని బార్‌ కౌన్సి్ల్‌ను హైకోర్టు ఆదేశించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని