TS High Court: భారాస ఎంపీ ఫౌండేషన్‌కు భూ కేటాయింపు.. రద్దు చేసిన హైకోర్టు
భారాస ఎంపీ, హెటిరో ఛైర్మన్ పార్థసారథి రెడ్డికి చెందిన సాయిసింధు ఫౌండేషన్‌కు భూ కేటాయింపును తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది.
హైదరాబాద్: భారాస ఎంపీ, హెటిరో ఛైర్మన్ పార్థసారథి రెడ్డికి చెందిన సాయిసింధు ఫౌండేషన్‌కు భూ కేటాయింపును తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. ఈ ఫౌండేషన్‌కు మేనేజింగ్ ట్రస్టీగా పార్థసారథిరెడ్డి ఉన్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఖానామెట్ వద్ద క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం కోసం 15 ఎకరాల భూమిని ఆ ఫౌండేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.
దీనికి సంబంధించిన జీవోను సవాల్ చేస్తూ 2019లో హైకోర్టులో కొందరు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. రైట్ సొసైటీతో పాటు ఊర్మిళ, సురేశ్‌కుమార్ పిల్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం.. భూ కేటాయింపును రద్దు చేస్తూ తీర్పు వెలువరించారు. భూ కేటాయింపుపై ప్రభుత్వం జారీ చేసిన జీవోను ధర్మాసనం కొట్టివేసింది. భూ కేటాయింపుల విధానానికి అనుగుణంగా దీనిపై పునఃపరిశీలన చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Motkupalli Narasimhulu : జైలులో చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగన్‌దే బాధ్యత : మోత్కుపల్లి
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Chandrababu : క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో సవాల్ చేసిన చంద్రబాబు
-
Narendra Modi: శివతత్వం ప్రతిబింబించేలా వారణాసి క్రికెట్ స్టేడియం..
-
Crime News: కుమారుడిని చంపి.. ఇంటి ముందు పడేసి: ‘మీ సింహమిదిగో’ అంటూ హేళన
-
Nani: అప్పుడే మొదటి సారి ప్రేమలో పడ్డా.. ప్రస్తుతం తనే నా క్రష్: నాని