TS High Court: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. ముగ్గురు నిందితులకు హైకోర్టు బెయిల్‌

సంచలనం సృష్టించిన ‘తెరాస ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో ముగ్గురు నిందితులకు బెయిర్‌ మంజూరైంది. ఈ కేసులో నిందితులైన రామంచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్‌లకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.

Updated : 01 Dec 2022 13:51 IST

హైదరాబాద్: సంచలనం సృష్టించిన ‘తెరాస ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో ముగ్గురు నిందితులకు బెయిర్‌ మంజూరైంది. ఈ కేసులో నిందితులైన రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్‌లకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. రూ.3 లక్షల పూచీకత్తుతో పాటు ఇద్దరు ష్యూరిటీ సమర్పించాలని నిందితులను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ప్రతి సోమవారం పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని హైకోర్టు స్పష్టం చేసింది. 

రామచంద్రభారతిపై బంజారాహిల్స్‌లో రెండు కేసులు..

మరోవైపు రామచంద్ర భారతిపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. నకీలీ ఆధార్‌, పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌తో పాటు నకిలీ పాస్‌పోర్టు కలిగి ఉన్నారనే ఆరోపణలపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసిన నేపథ్యంలో ఈ కేసుల్లో ఆయన్ను బంజారాహిల్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశముంది. నందకుమార్‌పైనా బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఐదు కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఫిలింనగర్‌లోని డెక్కన్‌ కిచెన్‌ లీజు విషయంలో వివిధ సెక్షన్ల కింద వేర్వేరు కేసులతో పాటు బెదిరింపు కేసులు సైతం పోలీసులు ఆయనపై నమోదు చేశారు. ఓ కేసులో ఇది వరకే నందకుమార్‌ను కస్టడీలోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని