TS News: 31 నుంచి పాఠశాలలు తెరుస్తున్నారా?: ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

వారాంతపు సంతల్లో కొవిడ్‌ నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపట్టారని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది.

Published : 28 Jan 2022 12:20 IST

హైదరాబాద్‌: వారాంతపు సంతల్లో కొవిడ్‌ నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపట్టారని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. దీనికి సంబంధించిన వివరాలు సమర్పించాలని ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. పాఠశాలల ప్రారంభంపై వివరాలు తెలపాలని.. ఈనెల 31 నుంచి తెరుస్తారా? అని ఉన్నత న్యాయస్థానం ఆరా తీసింది. దీనిపై ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ ఇంకా నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. సమ్మక్క జాతర ఏర్పాట్లపై నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. 

ఆన్‌లైన్‌ ద్వారా చేపట్టిన విచారణకు రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్‌) శ్రీనివాసరావు హాజరయ్యారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 3.16 శాతం ఉందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 77లక్షల ఇళ్లలో ఫీవర్‌ సర్వే చేపట్టి 3.45లక్షల కిట్లు అందజేశామని వివరించారు. కిట్లలో పిల్లల చికిత్సకు సంబంధించిన ఔషధాలు లేవని న్యాయవాదులు ప్రస్తావించగా.. వారి మందులను కిట్ల రూపంలో నేరుగా ఇవ్వకూడదని డీహెచ్‌ అన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని