
Published : 17 May 2021 19:45 IST
ఆ గర్భిణి మృతిపై వివరాలివ్వండి: హైకోర్టు
హైదరాబాద్: హైదరాబాద్‌లోని మల్లాపూర్‌కు చెందిన గర్భిణి పావని మృతిపట్ల హైకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. గర్భిణి మృతిపై వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. చికిత్స అందించేందుకు ఆర్టీ పీసీఆర్ నివేదిక కోసం ఒత్తిడి చేయొద్దని స్పష్టంచేసింది. ఇప్పటికే గర్భిణి పావని మృతిపై అధికారులు విచారణ జరిపారు. ప్రైవేటు ఆస్పత్రుల నిర్లక్ష్యం 100శాతం వల్లే పావని మృతి చెందినట్టు వైద్యాధికారుల విచారణలో వెల్లడైంది. ఆయాసంతో వెళ్లిన పావనిని ఐదు ఆస్పత్రుల వైద్యులు ఎవరూ కనీసం నాడి పట్టి కూడా చూడలేదని స్పష్టంచేశారు.
ఇవీ చదవండి
Tags :