Telangana news: వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను ప్రకటించిన ఇంటర్‌ బోర్డు

ఇంటర్‌ వార్షిక పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలను ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. ఆలస్య రుసుముతో డిసెంబరు 22 వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపింది.

Updated : 12 Nov 2022 20:46 IST

హైదరాబాద్‌: ఇంటర్‌ వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు ఆలస్య రుసుము లేకుండా ఈనెల 14 నుంచి 30 వరకు ఫీజు చెల్లించాలని ఇంటర్‌ బోర్డు తెలిపింది. ఆలస్య రుసుము రూ.100 చెల్లించి డిసెంబరు 2 నుంచి 6వరకు, రూ.500 చెల్లించి డిసెంబరు 8 నుంచి 12 వరకు, రూ.వెయ్యి ఆలస్య రుసుముతో డిసెంబరు 14 నుంచి 17 వరకు, రూ.2వేలు చెల్లించి డిసెంబరు 19 నుంచి 22 వరకు ఫీజు చెల్లించవచ్చని ఇంటర్‌ బోర్డు వెల్లడించింది. మొదటి, రెండో సంవత్సరం ఆర్ట్స్‌ విద్యార్థులు రూ.500, మొదటి సంవత్సరం ఒకేషనల్‌, రెండో సంవత్సరం ఒకేషనల్‌ విద్యార్థులు రూ.710 ఫీజు చెల్లించాలని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని